ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గోనడంపై ఇంకా క్లారిటీ లేదు. తమ జట్టును భారత్‌కు పంపడంపై పీసీబీ పూటకో మాట మారుస్తోంది. ఆసియాకప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పీసీబీ కూడా అమలు చేయనునున్నట్లు తెలుస్తోంది.
ఆసియాకప్‌లో పాల్గోనేందుకు భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్-2023ను శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్దమైంది.
ఈ ప్రాతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకుంది. అయితే భారత జట్టు తమ దేశంలో అడుగుపెట్టనప్పుడు.. పాక్ ప్రభుత్వం కూడా మా జట్టును పంపేందుకుఅనుమతి ఇస్తుందో లేదో తెలియదని పీసీబీ ఛీప్ సైతం అనుమానం వ్యక్తం చేశాడు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు.
బీసీసీఐ తమ జట్టును ముందుగా పాకిస్తాన్‌కు పంపడానికి అంగీకరించే వరకు.. పాక్ వరల్డ్‌కప్‌తో పాటు ఈతర మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వెళ్లకూడదని మియాందాద్ మరోసారి విషం చిమ్మాడు. కాగా ఐసీసీ డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్తాన్‌లు తలపడాల్సి ఉంది.
మీరు ఎందుకు వెళ్లాలి?
"పాకిస్తాన్ జట్టు 2012, 2016లో భారత్‌కు వెళ్లింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ రావడం భారత్ వంతు. భారత్ జట్టు ఇక్కడకు రానింతవరకు పాకిస్తాన్.. ప్రపంచకప్‌తో సహా ఎటువంటి క్రికెట్ ఆడటానికి వారి గడ్డపై అడుగుపెట్టకూడదు. అయితే భారత్‌తో తలపడేందుకు మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాము. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్‌కు పత్యేక గుర్తింపు ఉంది.
మేము ఇప్పటికీ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మనం భారత్‌కు వెళ్లకపోయినా దాని వల్ల పెద్ద నష్టమేమి లేదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మనకు బలం ఉందని పొరుగువారిపై పెత్తనం చెలాయించకూడదు. కాబట్టి రెండు క్రికెట్ బోర్డులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకుపోవాలి. క్రికెట్ ఇరు దేశాల్లో చాలా మందికి ఒక ఎమెషనల్" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment