![Shoaib Akhtar Hopes For Ind vs Pak Final At WC 2023 Badla Lena Hai - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/22/India-Vs-Pakistan.jpg.webp?itok=6ZKbL-F-)
World Cup 2023- India Vs Pakistan: ‘‘ఇండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలి అంతే! ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా లేదంటే అహ్మదాబాద్‌లోనా అన్న అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా ఇండియా- పాక్ మధ్యే టైటిల్ పోరు జరగాలి’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందానికి విజ్ఞప్తి చేశాడు.
కాగా 1983 వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి టైటిల్ గెలిచిన భారత జట్టు.. స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది.
ఇక ఈ ఏడాది సొంతగడ్డపై ఈ ఐసీసీ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ సేనకు.. ఈ అపవాదు చెరిపివేసే సువర్ణావకాశం ముంగిట నిలిచింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉంటే.. 2011 సెమీస్‌లో పాకిస్తాన్ ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా.. శ్రీలంకపై గెలుపొంది విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.
బీసీసీఐ, పీసీబీ ఏమీ చేయలేవు!
ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్లో ఇండియా- పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశం గురించి స్పందిస్తూ.. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ వట్టి మాటలు. బీసీసీఐ లేదంటే పీసీబీ ఈ విషయంలో ఏమీ చేయలేవు.
అనవసరపు మాటలు వద్దు
భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ గవర్నమెంట్ అనుమతి లేకుండా పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో మాజీ క్రికెటర్లు ఎవరూ ప్రతికూలంగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందంటే టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఇరు దేశాల మాజీ క్రికెటర్లు సంయమనం పాటించాలని అనవసరపు మాటలు మాట్లాడద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ..
Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్! అయితే ధోని మాదిరి..
Comments
Please login to add a commentAdd a comment