
రోహిత్ శర్మ- బాబర్ ఆజం(ఫైల్ ఫొటో)
ICC ODI WOrld Cup 2023 Ind Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలు పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.
మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న దాయాదులు పరస్పరం ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది.
మరోవైపు.. టీమిండియా ఢిల్లీలో ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ముగించుకున్న తర్వాత మ్యాచ్ జరిగే వేదికకు పయనం కానుంది. కాగా భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్-2023లో బాబర్ ఆజం బృందం శుభారంభం చేసిన విషయం తెలిసిందే.
ఉప్పల్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. తొలుత నెదర్లాండ్స్‌పై 81 పరుగులతో గెలుపొందిన పాక్.. మలి మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.
సంచలన విజయం అనంతరం టీమిండియాతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు.. రోహిత్ సేన ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు లోనై విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) అద్భుత భాగస్వామ్యం కారణంగా గట్టెక్కింది.
ఇక ఆసీస్‌పై భారత్ విజయం సాధించినా.. టాపార్డర్ దారుణంగా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు కూడా అహ్మదాబాద్‌లో అడుగుపెట్టనుంది.
చదవండి: 'అయ్యో షమీ.. రోహిత్ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు'
Pakistan team reached Ahmedabad for the clash against India....!!!
— Johns. (@CricCrazyJohns) October 11, 2023
- The Greatest battle in Cricket. pic.twitter.com/Qjx2oPcFju