India-Pakistan World Cup 2023 Clash: వన్డే వరల్డ్‌కప్.. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య పోరు.. అది కూడా భారత గడ్డ మీద.. అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ఈవెంట్లో దాయాదుల అమీతుమీకి అహ్మదాబాద్ వేదిక కానున్న విషయం తెలిసిందే. ఈ గుజరాత్ పట్టణంలో గల నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 14న దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరుగనుంది.
భారీ ఎత్తున పోటీ
భారత్- పాక్.. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచానికి మొత్తం పూనకాలే! మెగా టోర్నీలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారిన తరుణంలో.. ఈ పోరును నేరుగా వీక్షించేందుకు టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 25 నుంచి దశల వారీగా టిక్కెట్ల విక్రయ ప్రక్రియ జరుగనుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తెలిపింది.
నేరుగా వీక్షించడమే లక్ష్యంగా
ఈ క్రమంలో సెప్టెంబరు 3 నుంచి భారత్- పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కొనుగోలుతో పాటు మ్యాచ్ వీక్షంచే క్రమంలో అహ్మదాబాద్‌లో వసతి సౌకర్యాలపై కూడా అభిమానులు దృష్టి సారించారు.
అమాంతం 15 రెట్లు పెరిగాయి
దీంతో.. దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం ఉన్న మోదీ స్టేడియానికి క్రికెట్ ప్రేమికులు పోటెత్తనున్న తరుణాన్ని క్యాష్ చేసుకునేందుకు స్థానిక హోటల్స్ కూడా రెడీ అయిపోయాయి. అహ్మదాబాద్‌లోని ఒక్కో హోటల్లో సాధారణం కంటే టారిఫ్‌లు 15 రెట్లు పెరిగినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో నివేదిక వెల్లడించింది. ‘‘బుకింగ్.కామ్ ప్రకారం ఒక్క రాత్రి స్టే చేసేందుకు మామూలుగా 4 వేల రూపాయలు చార్జ్ చేసే హోటల్..
4 వేలు కాదు.. ఏకంగా 60 వేలు
ఇప్పుడు ఏకంగా ఇద్దరు వ్యక్తులు ఒక్కరాత్రి ఉండేందుకు 60,000 రూపాయలకు పెంచింది’’ అని సదరు రిపోర్టు పేర్కొంది. దీనిని బట్టి చూస్తే.. ఈసారి మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ జేబుకు చిల్లుపెట్టుకోకతప్పదు! ఇక ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కలెక్ట్ చేసుకునేందుకు ఇంకెంతగా ‘పోరాడాల్సి’ వస్తుందో ఊహించుకోండి!!
కాగా ఈ- టిక్కెట్లు కాకుండా ఫిజికల్ టిక్కెట్లు ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామరని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ కంటే ముందు ఆసియా కప్-2023లో సెప్టెంబరు 2న భారత్- పాక్ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే!
Comments
Please login to add a commentAdd a comment