WC 2023: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌! | WC 2023 Ind vs Pak: Gill Is Back Starts Batting Practice in Ahmedabad Report | Sakshi
Sakshi News home page

WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌! కానీ..

Published Thu, Oct 12 2023 6:49 PM | Last Updated on Thu, Oct 12 2023 7:29 PM

WC 2023 Ind vs Pak: Gill Is Back Starts Batting Practice in Ahmedabad Report - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ గిల్‌ (PC: X)

ICC WC 2023- Ind Vs Pak- Update On Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌.. డెంగ్యూ బారిన పడి ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌లతో టీమిండియా మ్యాచ్‌లకు ఈ యువ బ్యాటర్‌ అందుబాటులో లేకుండా పోయాడు. జట్టుతో పాటే ప్రయాణం చేసినా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

గంటపాటు ప్రాక్టీస్‌ చేసిన గిల్‌!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం.. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న అతడు నెట్‌ సెషన్‌లో పాల్గొన్నట్లు దైనిక్‌ జాగరణ్‌ కథనం వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. గంట పాటు గిల్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 14(శనివారం)న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ తలపడనున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు రిస్క్‌ తీసుకుంటారా?
అయితే, గిల్‌ డెంగ్యూ నుంచి కోలుకున్నప్పటికీ పాక్‌తో మ్యాచ్‌ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. తీవ్రమైన జ్వరం కారణంగా నీరసపడిపోయిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ను హైవోల్టేజీ మ్యాచ్‌తో బరిలోకి దించి బీసీసీఐ రిస్క్‌ తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని.. మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నపుడే అతడు మైదానంలో దిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఇషాన్‌ కిషన్‌ మరోసారి!
కాగా ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ టోర్నీలో శుభారంభం చేసిన రోహిత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ రెండు మ్యాచ్‌లలో శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో మరో యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా బరిలోకి దిగాడు.

చెన్నైలో ఆసీస్‌తో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఢిల్లీలో అఫ్గన్‌పై 47 పరుగులు సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరమైతే ఇషాన్‌కు మరోసారి లక్కీ ఛాన్స్‌ దక్కనుంది. ఇదిలా ఉంటే.. దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకుంది.

చదవండి: WC 2011లో నేనే కెప్టెన్‌ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement