వన్డే ప్రపంచకప్-2023లో బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. వరల్డ్ క్రికెట్‌లో బిగ్గెస్ట్ ఫైట్.. మరో 24 గంటల్లో షురూ కానుంది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు భారత్-పాకిస్తాన్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
భారత్-పాక్ జట్లు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ భేరి మోగించాయి. కాగా దాయాది పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా అన్నివిధాల సిద్దమవుతోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌సెషన్స్‌లో మునిగి తెలుతోంది. పాకిస్తాన్ కూడా గుజరాత్ గడ్డపై అడుగుపెట్టింది.
కిషన్, శార్థూల్ ఔట్..
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. డెంగ్యూ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే జట్టుతో కలిసిన గిల్, బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు.
గిల్ జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరోవైపు పాక్‌తో మ్యాచ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్‌ను కూడా పెట్టాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మేనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. అహ్మదాబాద్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందన షమీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్
Comments
Please login to add a commentAdd a comment