టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. 2023 ఏడాదిలో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్‌లు సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో శ్రీలంతో మ్యాచ్‌లో 92 పరుగులు చేసిన గిల్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక, బాబర్ ఆజం పేరిట ఉండేది. వీరిద్దరూ ఇప్పటివరకు 11 సార్లు పిఫ్టీ ప్లస్ స్కోర్‌లు సాధించారు.
టీమిండియా భారీ స్కోర్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర రాహుల్ రూపంలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: WC 2023: ముగ్గురు మొనగాళ్లు.. కానీ పాపం! అయితేనేం పాక్ వరల్డ్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment