
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సన్‌రైజర్స్ విఫలమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల దాటికి ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మహ్మద్ సిరాజ్ ఆదిలోనే హెడ్, అభిషేక్‌ను ఔట్ చేసి సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. సిరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు.
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఊదిపడేసింది. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. గిల్ (43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(49), రూథర్ ఫర్డ్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో షమీ రెండ వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్ ఓ వికెట్ సాధించారు. ఈ ఓటమితో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది.