వన్డే ప్రపంచకప్-2023లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస విజయాలతో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
ఈ మెగా ఈవెంట్‌లో దాయాది పాకిస్తాన్‌ను కూడా భారత్ చిత్తు చేసింది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వరుసగా 8వ సారి వరల్డ్‌కప్ టోర్నీలో పాక్‌ను భారత్ ఓడించింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా రోహిత్ సేనను ఆకాశానికెత్తాడు. ప్రస్తుత భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే కచ్చితంగా వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకుంటందని అజారుద్దీన్ థీమా వ్యక్తం చేశాడు.
"నా విషెస్ ఎల్లప్పుడూ భారత జట్టుకు ఉంటాయి. మా జట్టు ఈ సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ మెగా టోర్నీని మా బాయ్స్ అద్భుతంగా ఆరంభించారు. వరల్డ్‌కప్ ట్రోఫిని సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ప్రస్తుత జట్టు అన్ని విధాల సమతూకంగా ఉంది. అదే విధంగా సరైన నాయకుడు కూడా ఉన్నాడు. అతడు జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు అని ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment