టీమిండియాను ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తా: పాక్‌ నటి | Pakistani Actress Bold Promise If Bangladesh Beat India In Cricket World Cup 2023 - Sakshi
Sakshi News home page

World Cup 2023: టీమిండియాను ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తా: పాక్‌ నటి

Published Wed, Oct 18 2023 4:39 PM | Last Updated on Wed, Oct 18 2023 6:19 PM

Pakistani Actress Bold Promise If Bangladesh Beat India In Cricket World Cup 2023 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిని ఇప్పటికీ పాక్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియాను ఏదో విధంగా టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా భారత జట్టు ఆక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ నటి సెహ‌ర్ షిన్వారి కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లా క్రికెటర్‌లకు సెహ‌ర్ షిన్వారి డేటింగ్‌ ఆఫర్‌ ఇచ్చింది. రేపటి మ్యాచ్‌లో టీమిండియాను ఓడించిన బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తానని ఆమె ప్రామిస్‌ చేసింది. 

అల్లా దయతో బంగ్లా జట్టు భారత్‌పై మన వంతు ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశిస్తున్నాను. బంగ్లా జట్టు భారత్‌ను ఓడిస్తే.. నేను ఢాకా వెళ్లి బంగ్లా బాయ్‌తో ఫిష్ డిన్న‌ర్ డేట్‌ చేస్తాను అని ఎక్స్‌లో ఆమె రాసుకొచ్చింది. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలకు భారత అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా స్ట్రాంగ్‌ కౌంటరిస్తున్నారు. మీవల్లే చేతకాలేదు ఇంకా బంగ్లాతో అవుతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడిపై వేటు! అశ్విన్‌ రీఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement