దాదాపు పుష్కర కాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీకు ఐసీసీ షెడ్యూల్ ఖారారు చేయడంతో.. ఈ ఈవెంట్‌లో పాల్గోనే ఆయా జట్లు తమ సన్నహాకాలను కూడా ప్రారంభించాయి. అయితే ప్రపంచకప్ విషయంలో అందరిది ఒక లెక్క. తనొదక లెక్క అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.
ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం పాల్గొంటుందా..? లేదా..? అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. తమ జట్టును భారత్‌కు పంపించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ ప్రభుత్వం సైతం పూటకో మాట మారుస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రీడా శాఖామంత్రి ఎహ్సాన్ మజారీ కీలక వాఖ్యలు చేశాడు.
ఆసియాకప్ ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే పాకిస్తాన్ జట్టు సైతం భారత్‌కు వెళ్లదని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్‌కు భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏసీసీ ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఎహ్సాన్ మజారీ విలేకురల సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేస్తే.. భారత్‌లో జరిగే మేము కూడా అదే అదే డిమాండ్ చేస్తాము" అని అతను పేర్కొన్నాడు. అతడు చేసిన వాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.
ఉన్నతస్థాయి కమిటీ..
ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోనడంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో ఎహ్సాన్ మజారీ కూడా సభ్యునిగా ఉన్నాడు. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ భారత్-పాకిస్తాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
చదవండి: BAN W vs IND W: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment