భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023ను క్యాష్ చేసుకోనేందుకు అధికారిక బ్రాడ్ కాస్టర్ డిస్నీస్టార్ సిద్దమైంది. ఐపీఎల్ 2023 హక్కులు కోల్పోయి నష్టాలు చవిచూసిన హాట్‌స్టార్.. వాటిని పూడ్చే పనిలో పడింది. ఆక్టోబర్ 5 నుంచి జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ను డిస్నీస్టార్ మీడియా ప్లాట్ ఫామ్స్ స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ ప్రసారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీ అడ్వర్టైజమెంట్స్‌కు సంబంధించిన రేట్ కార్డ్‌ను డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించిందని ఎక్స్ఛేంజ్4మీడియా పేర్కొంది.
అయితే వన్డే ప్రపంచకప్ 2023లోని మ్యాచ్‌లు అన్నింటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించిన హాట్‌స్టార్.. అడ్వర్టైజ్‌మెంట్ రేట్స్‌ను మాత్రం భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజు రూ. 150 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అసోసియేట్ స్పాన్సర్స్ స్లాట్ ఫీజు రూ. 88 కోట్లుగా ఉంచిందని సమాచారం. పవర్డ్ బై స్పాన్సర్ కావాలనుకునే బ్రాండ్‌లు రూ. 75 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా ఆసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ను ఎంచుకునే వారు మాత్రం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను అందించాల్సి ఉంటుంది.
భారత్-పాక్ మ్యాచ్‌కు ప్రత్యేక ధర..
ఇక ప్రపంచక్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు రేట్లను ప్రత్యేకంగా హాట్‌స్టార్ నిర్ణయించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 సెకన్ల యాడ్ కు రూ. 30 లక్షల ధర ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్‌గా ఈ ప్రపంచకప్ ద్వారా మొత్తం 1000 కోట్లను ఆర్జించాలని డిస్నీ హాట్‌స్టార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment