
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా చరిత్రను రిపీట్ చేసింది. వరల్డ్‌కప్ టోర్నీల్లో వరుసగా ఎనిమిదోసారి పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది. వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా దాయాదితో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. పాకిస్తాన్‌కు ఈ ఏడాది టోర్నీలో ఓటమి రుచి చూపించింది.
వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసిన భారత్.. ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఒకే ప్రత్యర్ధిపై అత్యధిక విజయాలు సాధించిన పాకిస్తాన్ రికార్డును భారత్ సమం చేసింది. పాకిస్తాన్ కూడా ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకను 8 సార్లు ఓడించింది. వన్డే ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా శ్రీలంక చేతిలో పాక్ ఓటమి చెందలేదు. తాజా విజయంతో టీమిండియా కూడా పాక్ సరసన నిలిచింది.
హిట్‌మ్యాన్ షో..
ఇక ఈ మ్యాచ్‌లో 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 31.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(53) పరుగులతో రాణించాడు.
పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది రెండు వికెట్లు, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసినపాకిస్తాన్ 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు.
చదవండి: WC 2023- Ind Vs Pak: వార్ వన్‌సైడ్.. టీమిండియా చేతిలో పాక్ చిత్తు! ఆ రెండూ తప్పితే.. మిగతావన్నీ..
Comments
Please login to add a commentAdd a comment