
PC: BCCI/IPL.com
IPl 2025 PBKS vs LSG Live Updates:
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52 నాటౌట్) దుమ్ములేపారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆన్ ఫైర్..
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్(45) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(8) పరుగులతో పాటు ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఆర్య.. దిగ్వేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(25), శ్రేయస్ అయ్యర్(3) ఉన్నారు.
రాణించిన పూరన్, బదోని.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), మార్క్రామ్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, మాక్స్‌వెల్, చాహల్ తలా వికెట్ సాధించారు.
లక్నో ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్
డేవిడ్ మిల్లర్ రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మిల్లర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో బదోని(32), సమద్(8) ఉన్నారు.
లక్నో నాలుగో వికెట్ డౌన్.. పూరన్ ఔట్
నికోలస్ పూరన్ రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన పూరన్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. 12 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న పూరన్..
10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(23 బంతుల్లో 33) దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పూరన్‌తో పాటు బదోని(11) ఉన్నారు.
కష్టాల్లో లక్నో.. పంత్ ఔట్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పంత్.. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.
లక్నో రెండో వికెట్ డౌన్..
ఐడెన్ మార్క్రామ్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మార్క్రామ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్ ఉన్నాడు.
తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మార్ష్.. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు.
ఐపీఎల్-2025లో లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున లాకీ ఫెర్గూసన్ అరంగేట్రం చేశాడు. అజ్మతుల్లా ఓమర్జాయ్ స్ధానంలో ఫెర్గూసన్ పంజాబ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్.