న్యూఢిల్లీ: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్‌గా పేరుగాంచిన జావేద్ మియాందాద్.. ఒకానొక సందర్భంలో ఆ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు. క్రికెటర్‌గా ఆడే సమయంలోనే కాకుండా కోచ్‌గా చేసే సమయంలో కూడా మియాందాద్ దూకుడుగా ఉండేవారు. జట్టు విజయం సాధించాలనే కసితో మియాందాద్ కోచ్‌గా పని చేసిన సమయంలో పదే పదే ప్రత్యర్థి జట్లపై నోరు పారేసుకున్న సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. మియాందాద్ ఆవేశానికి బాధపడ్డ వారులో ఇర్ఫాన్ పఠాన్ కుటుంబం కూడా ఉందట. 2003-04 పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఇర్ఫాన్ సభ్యుడు.. అప్పుడు ఈ ఎడమ చేతి వాటం పేసర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
దానికి ఇర్ఫాన్ పఠాన్‌పై అప్పటి కోచ్ మియాందాద్ చేసిన తీవ్రమైన కామెంటే కారణం. ఇర్ఫాన్ పఠాన్ వంటి బౌలర్లు తమ పాకిస్తాన్‌లో వీధికో బౌలర్ ఉంటాడని మియాందాద్ తీవ్రంగా అవమానించాడట. ఈ విషయాన్ని ఇర్ఫాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘ నాకు బాగా గుర్తు. నా లాంటి బౌలర్లు పాక్‌లో వీధికి ఒకరు ఉంటారని మియాందాద్ అన్నాడు. ఆ న్యూస్ మా నాన్నకు చేరింది. దీన్ని మా నాన్న సీరియస్‌గా తీసుకున్నారు.
మియాందాద్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఏకంగా పాకిస్తాన్‌కు వచ్చేశారు. మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి.. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళదామని పట్టుబట్టారు. నేను మియాందాద్‌ను కలిసి తీరుతానన్నారు. కానీ నేను అక్కడికి వెళ్లనివ్వలేదు. అదే సమయంలో మా నాన్నను మియాందాద్ చూశారు. నేను మీ అబ్బాయిని ఏమీ అనలేదు. ఏ విధమైన కామెంట్ చేయలేదు అని మియాందాద్ చెప్పుకొచ్చాడు. మా ఫాదర్ ముఖం బాగా ఎర్రబడిపోయింది. కానీ తమాయించుకున్న మా నాన్న.. నేను నీకు ఏమీ చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నేను నిన్ను కలిసి ఒక మంచి ప్లేయర్ అని చెబుదామని వచ్చా’ అని బదులిచ్చారు.’ అని ఇర్ఫాన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment