లాహోర్: 1996 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ముందుగా ప్రకటించిన జాబితాలో దిగ్గజ క్రికెటర్‌ను జావెద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడంలో అతి పెద్ద కుట్ర దాగి ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వెల్లడించాడు. ఇందుకు ప్రస్తుత ప్రధాని, అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సూత్రధారని సంచలన ఆరోపణ చేశాడు. ఆ కుట్రలో తనను పావుగా వాడుకున్నారన్నాడు.1992 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఇమ్రాన్‌ఖాన్.. తన శిష్యుడు, కెప్టెన్‌గా ఎంపికైన వసీం అక్రమ్‌లు కలిసి మియాందాద్‌ను తొలగించారని అన్నాడు. (మా బ్యాట్స్‌మన్ తర్వాతే సెహ్వాగ్..)
‘1993 ప్రాంతంలో జట్టునుంచి మియాందాద్‌కు ఉద్వాసన పలకడానికి కుట్ర జరిగింది. అందుకే నన్ను జావెద్‌తో పోల్చడం ప్రారంభించాడు. నిజాయతీగా చెప్పాలంటే మియాందాద్‌తో పోలిస్తే ఒక్కశాతం కూడా అతడికి నేను సరితూగను. నాలుగోస్థానంలో దిగే నన్ను మియాందాద్‌ను తప్పించగానే ఆరోస్థానానికి దిగజార్చారు. ఇమ్రాన్ ఆదేశాలమేరకు నడుచుకునే కెప్టెన్ అక్రమ్ ఇదంతా చేశాడు’అని బాసిత్ ఆరోపించాడు. నా ఆట పట్ల నాకు ప్యాషన్ ఉండేది. నేను భారీ షాట్లు ఆడబోయి ఔటయ్యేవాడిని. ఇక 1996 ప్రపంచకప్ పాకిస్తాన్‌న్ జట్టులో ముందుగా మియాందాద్ పేరు లేదని, తాను వైదొలిగితేనే జావెద్ జట్టులోకి వచ్చాడని బాసిత్ తెలిపాడు. (అప్పటివరకూ ఐపీఎల్ వాయిదా..!)
‘ముందుగా ప్రకటించిన 1996 ప్రపంచకప్ పాకిస్తాన్ జట్టులో మియాందాద్ పేరు లేదు. 15 సభ్యులతో కూడిన టీమ్‌లో నేనొకడిని. కానీ మియాందాద్ ప్లేయర్ల దగ్గరకు వచ్చి అతనికి వరల్డ్‌కప్ ఆడాలనుందని విజ్ఞప్తి చేశాడు. అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన రికార్డు నమోదు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో మియాందాద్‌పై ఉన్న గౌరవంతో ఆ ప్లేస్‌ను త్యాగం చేశా’ అని బాసిత్ అలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment