భారత్‌తో యుద్ధానికి మేం సిద్ధం | Javed Miandad abuses PM Modi, wants India to throw him out of power | Sakshi
Sakshi News home page

భారత్‌తో యుద్ధానికి మేం సిద్ధం

Published Tue, Oct 4 2016 3:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

భారత్‌తో యుద్ధానికి మేం సిద్ధం - Sakshi

భారత్‌తో యుద్ధానికి మేం సిద్ధం

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ జావేద్‌ మియాందాద్‌.. భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మియాందాద్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ప్రజలు నరేంద్ర మోదీని అధికారంలో నుంచి తొలగించాలని చెప్పాడు.

‘భారత ప్రజలకు ఓ విషయం చెప్పదలచుకున్నా. మీ దేశంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని చంపగలరు. మీరందరూ కలసికట్టుగా ఉండి, అలాంటివారికి వ్యతిరేకంగా పోరాడాలి. నేను క్రికెట్‌ ఆడే రోజుల్లో చాలాసార్లు భారత్‌కు వెళ్లాను. అక్కడ సాధారణ ప్రజలు మంచివాళ్లు. అయితే అక్కడ నరేంద్ర మోదీ వంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరిని బెదిరిస్తున్నారో ఆయనకు తెలియదు. మేం యుద్ధానికి సిద్ధం. పాకిస్థాన్‌లో ప్రతి పిల్లాడు, ప్రతి పౌరుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్లు పిరికిపందలు (భారతీయులు). వాళ్లకు సైన్యం లేదు’ అని మియాందాద్‌ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement