వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాతో మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆసక్తికర (అతి) వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ అంటే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదని, టీమిండియాతో తాము ఆడబోయే మ్యాచ్‌కు అంత హైప్ అవసరం లేదని, మెగా టోర్నీలో తాము ఆడబోయే 9 మ్యాచ్‌లూ తమకు ముఖ్యమేనని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ఫోకస్ ఒక్క జట్టుపై మాత్రమే ఉండదని, తామాడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవడమే తమ లక్ష్యమని తెలిపాడు.
కేవలం ఇండియాపై గెలిస్తే తాము వరల్డ్‌కప్ గెలిచినట్లు కాదని, మొత్తం 11 మ్యాచ్‌ల్లో (9 తొలి దశ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్) గెలిస్తేనే జగజ్జేతలమవుతామని పేర్కొన్నాడు. శ్రీలంకతో త్వరలో (జులై 16 నుంచి) ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ పాక్ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 15న భారత్-పాక్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు పాక్.. నెదర్లాండ్స్, శ్రీలంకలతో అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌లో ఆడుతుంది. అనంతరం అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో, చెన్నై వేదికగా 23న ఆఫ్ఘనిస్తాన్‌తో, అదే చెన్నై వేదికగా 27న సౌతాఫ్రికాతో, కోల్‌కతా వేదికగా 31న బంగ్లాదేశ్‌తో, బెంగళూరు వేదికగా నవంబర్ 4న న్యూజిలాండ్‌తో, కోల్‌కతా వేదికగా నవంబర్ 12న ఇంగ్లండ్‌తో పాక్ తమ తొలి దశ మ్యాచ్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment