వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్-పాక్‌ల మధ్య జరుగబోయే హైఓల్టేజీ మ్యాచ్‌పై పాక్ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ (1992) జట్టులోకి సభ్యుడు ఆకిబ్ జావిద్ అవాక్కులు చవాక్కులు పేలాడు. అహ్మదాబాద్ వేదకగా అక్టోబర్ 14న జరిగే ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టే ఫేవరెట్ అని గొప్పలు పోయాడు. ఇంతటితో ఆగకుండా టీమిండియాను కించపరిచే విధంగా పలు అతి వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ సారధ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఫిట్‌నెస్, ఫామ్ రెండూ అంతంతమాత్రమేనని చెత్త వాగుడు వాగాడు. ప్రస్తుత జట్టుతో టీమిండియా తమపై గెలవలేదని ప్రగల్భాలు పలికాడు. భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా, సమతూకంగా ఉందని.. టీమిండియాలోని ఆటగాళ్లు పేరుకే పెద్ద ఆటగాళ్లని.. పాక్‌తో మ్యాచ్‌లో సో కాల్డ్ బిగ్ ప్లేయర్స్ అంతా తడబడటం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే వారికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం బెటర్ అని సూచించాడు. క్రిక్‌విక్ అనే వెబ్‌పైట్‌తో మాట్లాడుతూ ఆకిబ్ జావిద్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా పాక్ ఆటగాళ్లు, మాజీలు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి అన్నది కాదనలేని సత్యం. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌లు ఏడు సార్లు ఎదురెదురుపడగా అన్ని సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.
ఇదిలా ఉంటే, తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉండింది. అయితే మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను ఒక రోజు ముందు ప్రీ పోన్ చేశారు. ఈ మ్యాచ్‌తో పాటు ఐసీసీ మరో ఎనిమిది మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. పలు రకాల కారణాల చేత ఐసీసీ తప్పనిసరి పరిస్థితుల్లో షెడ్యూల్‌ను మార్చింది. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కంటే ముందే భారత్-పాక్‌లు ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్ 2న తలపడనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment