aaqib javed
-
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా చీఫ్ సెలెక్టర్
పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ ఆకిబ్ జావిద్ ఎంపికయ్యాడు. జావిద్ ఎంపిక టెంపరరీ బేసిస్ (తాత్కాలికం) మీద జరిగింది. జావిద్ వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పదవిలో కొనసాగుతాడు. జావిద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.కాగా, కొద్ది రోజుల కిందట గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ పదవికి అర్దంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెడ్‌బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పీ పాక్ వైట్‌బాల్ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో (2-1) ఓడించింది. అయితే పాక్ టీ20 సిరీస్‌ను మాత్రం 0-3 తేడాతో కోల్పోయింది.గిల్లెస్పీకి ముందు పెర్మనెంట్ వైట్‌బాల్ కోచ్‌గా ఎంపికైన గ్యారీ కిర్‌స్టన్ బోర్డుతో విభేదాల కారణంగా ఒక్క వన్డేలో కూడా కోచ్‌గా పని చేయకుండా వైదొలిగాడు. పాక్ గత ఏడాది కాలంలో ఐదుగురు వైట్‌బాల్ కోచ్‌లను మార్చింది. పాక్ పెర్మనెంట్ వైట్‌బాల్ హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోగా ముగుస్తుందని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అనంతరం పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సిరీస్లన్నిటికీ పాక్ హెడ్‌కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించనున్నాడు.కాగా, పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రిత్యా భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని తేల్చిచెప్పింది. దీంతో టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ నుంచి ఇతర దేశానికి మార్చాలని ఐసీసీ చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని తటస్ఠ వేదికపై నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు పాక్ నో చెప్పడంతో ఐసీసీ పునరాలోచనలో పడింది. -
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం..
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో కూడా జావేద్ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు. -
వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు అంత సీన్ లేదు..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్-పాక్‌ల మధ్య జరుగబోయే హైఓల్టేజీ మ్యాచ్‌పై పాక్ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ (1992) జట్టులోకి సభ్యుడు ఆకిబ్ జావిద్ అవాక్కులు చవాక్కులు పేలాడు. అహ్మదాబాద్ వేదకగా అక్టోబర్ 14న జరిగే ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టే ఫేవరెట్ అని గొప్పలు పోయాడు. ఇంతటితో ఆగకుండా టీమిండియాను కించపరిచే విధంగా పలు అతి వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సారధ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఫిట్నెస్, ఫామ్ రెండూ అంతంతమాత్రమేనని చెత్త వాగుడు వాగాడు. ప్రస్తుత జట్టుతో టీమిండియా తమపై గెలవలేదని ప్రగల్భాలు పలికాడు. భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా, సమతూకంగా ఉందని.. టీమిండియాలోని ఆటగాళ్లు పేరుకే పెద్ద ఆటగాళ్లని.. పాక్‌తో మ్యాచ్‌లో సో కాల్డ్ బిగ్ ప్లేయర్స్ అంతా తడబడటం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే వారికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం బెటర్ అని సూచించాడు. క్రిక్విక్ అనే వెబ్పైట్తో మాట్లాడుతూ ఆకిబ్ జావిద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ ఆటగాళ్లు, మాజీలు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి అన్నది కాదనలేని సత్యం. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌లు ఏడు సార్లు ఎదురెదురుపడగా అన్ని సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. ఇదిలా ఉంటే, తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉండింది. అయితే మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను ఒక రోజు ముందు ప్రీ పోన్ చేశారు. ఈ మ్యాచ్‌తో పాటు ఐసీసీ మరో ఎనిమిది మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. పలు రకాల కారణాల చేత ఐసీసీ తప్పనిసరి పరిస్థితుల్లో షెడ్యూల్‌ను మార్చింది. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కంటే ముందే భారత్-పాక్‌లు ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్ 2న తలపడనున్న విషయం తెలిసిందే. -
టీమిండియాలో స్టార్లు ఉన్నా గానీ.. మాదే పైచేయి: పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
India have big names but their fitness and form is not up to the mark: ‘‘ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సమతూకంగా ఉంది. యువ రక్తంతో నిండి ఉంది. టీమిండియాలో స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్ల ఫిట్నెస్, ఫామ్ ఆశించిన తీరుగా లేదు. అందుకే భారత జట్టు తడబడుతోంది. జట్టు కూర్పు కోసం ఫామ్‌లో ఉన్న కొత్త ఆటగాళ్లను వెదికిపట్టుకోవాలి. అయితే, పాక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ( ఫైల్ ఫోటో ) ఈసారి పాక్ ఓడించగలదు ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ ప్రగల్బాలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. పటిష్ట టీమిండియాను బాబర్ ఆజం జట్టు ఓడించగలదంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 14న మ్యాచ్ జరుగనుంది. టోర్నీకే హైలైట్ మ్యాచ్ ఆరోజే మెగా టోర్నమెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలవనున్న ఈ మ్యాచ్ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అకీబ్ జావేద్ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా పాక్ పేస్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. నసీం షా కంటే జమాన్ ఖాన్ బెటర్ అని పేర్కొన్నాడు. ( ఫైల్ ఫోటో ) నసీం కంటే అతడే బెటర్ ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో జమాన్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ డెత్ బౌలర్లలో తనూ ఒకడని చెప్పవచ్చు. నసీం షా కంటే అతడే బెటర్ అనిపిస్తోంది. షాహిన్, హారిస్, జమాన్.. పరిమిత ఓవర్లలో ఈ త్రయం ఉంటే పాకిస్తాన్ జట్టుకు మేలు చేకూరుతుంది’’ అని జావేద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా వన్డే కప్-2023 నేపథ్యంలో ప్రకటించిన పాక్ జట్టులో జమాన్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో నసీం షాకు బదులు లాహోర్ ఖలందర్స్ బౌలర్‌ను తీసుకోవాల్సిందని ఆ జట్టు కోచ్ అకీబ్ జావేద్ పేర్కొనడం గమనార్హం. చదవండి: తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్‌కప్.. -
WC 2023: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! టీమిండియా బ్యాటర్లు..
ICC ODI World Cup 2023- India Vs Pakistan: టీమిండియా బ్యాటర్లపై పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అక్కసు వెళ్లగక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లు పాక్ బౌలర్లలా బౌలింగ్ చేయలేరని.. అందుకే భారత జట్టు వందల కొద్ది పరుగులు రాబట్టిందని పేర్కొన్నాడు. ఒకవేళ పాక్‌తో తలపడి ఉంటే భారీ స్కోర్లు నమోదయ్యేవి కావంటూ టీమిండియా ఆట తీరును తక్కువ చేసేలా మాట్లాడాడు. అదరగొట్టిన టీమిండియా.. అదే హైలైట్ కాగా మూడు వన్డే, మూడు టీ20 సిరీస్‌లు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 18న హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ(208) హైలైట్‌గా నిలిచింది. అదే విధగా రాయ్‌పూర్‌లో జనవరి 21న జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్‌ను 108 పరుగులకే కట్టడి చేసి 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటి ఇక నామమాత్రపు ఇండోర్ వన్డేలో జనవరి 24 నాటి మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుబ్‌మన్ గిల్ (112) సెంచరీలతో చెలరేగడంతో ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. కివీస్ 295 పరుగులకే చేతులెత్తేయడంతో 90 రన్స్ తేడాతో గెలిచింది. తద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంది. పాక్ గట్టి పోటీనిస్తుంది ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ టీమిండియా- న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను ఉద్దేశించి జియో న్యూస్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టీమిండియా పాకిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ గట్టిపోటీనిస్తుంది. మా ప్రధాన బలం అదే.. కివీస్‌లా కాదు వరల్డ్‌కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లినా సరే.. అక్కడి పిచ్‌లు పాక్ ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు 400 మేర స్కోరు చేశారు. అయితే, పాకిస్తాన్ బౌలింగ్.. న్యూజిలాండ్ బౌలింగ్‌లా ఉండదు. నిజానికి వన్డేల్లో పాకిస్తాన్ క్రికెట్‌కు బౌలింగే ప్రధాన బలం. షాహిన్ ఆఫ్రిది, హారీస్ రవూఫ్, నసీం షా పూర్తి ఫిట్‌గా ఉన్నారు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కూడా కీలకసమయంలో రాణించగలరు. కాబట్టి ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లలో పాకిస్తాన్ గనుక 300 స్కోరు చేసిందంటే దానిని ఛేధించడం ఏ జట్టుకైనా కష్టమే’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా 1992 ప్రపంచకప్ గెలిచిన జట్టులో జావేద్ సభ్యుడన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో?! ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ వేదిక పాకిస్తాన్ కాగా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లదంటూ ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించాడు. దీంతో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ జట్టును భారత్‌కు పంపమంటూ పీసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు బోర్డులు తీసుకునే నిర్ణయంపైనే భారత్- పాక్ మ్యాచ్‌ల నిర్వహణ ఆధారపడి ఉంది. చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి! IND vs AUS: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! ఇక కష్టమే -
టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది ఆడకూడదు: పాక్ మాజీ ఆటగాడు
ఆసియాకప్-2022కు గాయం కారణంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఆఫ్రిది.. ఇటీవల లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమైన ఆఫ్రిది.. టీ20 ప్రపంచకప్-2022కు మాత్రం ఎంపికయ్యాడు. కాగా ఆఫ్రిది గాయం నుంచి పూర్తిగా కోలుకోలేనప్పటికీ అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడాన్ని పాకిస్తాన్ మాజీ బౌలర్ ఆకిబ్ జావేద్ తప్పుబట్టాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండమని ఆఫ్రిదిని జావేద్ సూచించాడు. ఈ మెరకు క్రికెట్ పాకిస్తాన్‌తో జావేద్ మాట్లాడూతూ.. "షాహీన్ అఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా ఉంటారు. ఈ సమయంలో అఫ్రిదికి నేను ఒకే ఒక సలహా ఇవ్వగలను. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ కంటే అఫ్రిది ఫిట్నెస్ ముఖ్యం" అని పేర్కొన్నాడు. చదవండి: టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం.. -
T20 WC 2022: ‘బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవదు’
Asia Cup 2022- Pakistan- T20 World Cup 2022: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాకిస్తాన్ ఏ టోర్నీ కూడా గెలవలేదంటూ ఆ జట్టు మాజీ పేసర్ అకిబ్ జావేద్ అన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లుగా పేరొందినా జట్టుకు మాత్రం ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం లేదంటూ విమర్శించాడు. ఈ ఓపెనర్లతో పాకిస్తాన్ ఐసీసీ టోర్నీలు గెలిచే అవకాశం లేదంటూ వ్యాఖ్యానించాడు. విఫలమైన బాబర్ ఆజం! ఆసియా కప్-2022 టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో ఈ ‘స్టార్ ఓపెనర్’ చేసిన మొత్తం పరుగులు 68. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు. అదరగొట్టిన రిజ్వాన్.. అయినా! ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం 281 పరుగులతో రాణించాడు. ఆసియా కప్-2022 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కీలక మ్యాచ్‌లలో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తన ఇన్నింగ్స్‌తో విజయాలు అందించాడు. అయితే, ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలో తెలియదు! దూకుడేది? ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అకిబ్ జావేద్.. బాబర్ ఆజం, రిజ్వాన్ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఇద్దరు ఓపెనర్లు మేజర్ టోర్నీల్లో గెలిపించలేరు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ప్రపంచంలో నంబర్ 1,2 ఆటగాళ్లుగా పేరొందారు. అలాంటి బ్యాటర్లకు ఎప్పుడు ఎలా ఆడాలో తెలియాలి కదా! వైస్ కెప్టెన్ రిజ్వాన్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో.. 15 ఓవర్ల పాటు ఆడాడు. అవసరమైన రన్‌రేటు 8 ఉన్నప్పటి నుంచి అది 17కు పెరిగేంత వరకు ఉన్నాడు. ఇలాంటి ఆట తీరుతో వీళ్లేం గెలుస్తారు’’ అని జావేద్ పెదవి విరిచాడు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు! అదే విధంగా ఫఖర్ జమాన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై స్పందిస్తూ.. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు. నిజానికి బాబర్ లేదంటే రిజ్వాన్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తేనే జట్టుకు ఉపయోగం ఉంటుంది. ఓపెనర్‌గా తను రాణించగలడు’’ అని అకిబ్ జావేద్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియాకప్-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అకిబ్ జావేద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ఎందుకంటే! 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్!