ఆసియాకప్-2022కు గాయం కారణంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఆఫ్రిది.. ఇటీవల లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమైన ఆఫ్రిది.. టీ20 ప్రపంచకప్-2022కు మాత్రం ఎంపికయ్యాడు.
కాగా ఆఫ్రిది గాయం నుంచి పూర్తిగా కోలుకోలేనప్పటికీ అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడాన్ని పాకిస్తాన్ మాజీ బౌలర్ ఆకిబ్ జావేద్ తప్పుబట్టాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండమని ఆఫ్రిదిని జావేద్ సూచించాడు.
ఈ మెరకు క్రికెట్ పాకిస్తాన్‌తో జావేద్ మాట్లాడూతూ.. "షాహీన్ అఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా ఉంటారు. ఈ సమయంలో అఫ్రిదికి నేను ఒకే ఒక సలహా ఇవ్వగలను. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ కంటే అఫ్రిది ఫిట్‌నెస్ ముఖ్యం" అని పేర్కొన్నాడు.
చదవండి: టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం..
Comments
Please login to add a commentAdd a comment