ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ షాహీన్ షా అఫ్రిది మెకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను వీడిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం మెకాలి గాయంతోనే కాకుండా అపెండిక్స్‌తో కూడా బాధపడుతున్నాడు. తాజాగా అఫ్రిది తన గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు.
అపెండెక్టమీ సర్జరీ చేయించుకున్నట్లు ట్విటర్ వేదికగా షాహీన్ వెల్లడించాడు. "ఈరోజు అపెండెక్టమీ చేయించుకున్నాను. అల్లా దయవల్ల బాగానే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు దన్యవాదాలు" అంటూ షాహీన్ ట్వీట్ చేశాడు.
ఈ క్రమంలో అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కాగా గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది.
Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022
చదవండి: IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ!
Comments
Please login to add a commentAdd a comment