
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
"పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా
అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో కూడా జావేద్ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment