
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన నవనీత్ కౌర్ రానా మొదటి సమావేశాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీనిపై నవనీత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం అనంతరం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆమె..‘‘ జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడానికి ఇది సరైన వేదిక కాదు. వాటి కోసం ప్రత్యేకంగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ప్రజా సమస్యలపై చర్చకు మాత్రమే ఇక్కడ చోటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా అమరావతి నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment