
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment