జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సప్త సముద్రాలు దాటి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటుతున్నాయి.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టపై అమెరికాలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి హాజరుకావాలని ఆలయ నిర్వాహకులకు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో హ్యూస్టన్‌లో భక్తులు ఎంతో ఉత్సాహంతో కారు ర్యాలీ చేపట్టారు. హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ, భారీ స్థాయిలో కారు ర్యాలీని చేపట్టారు. 500 మందికి పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 216 కార్లతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు.
జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీ 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. వీహెచ్‌పీఏ సభ్యుడు అమర్ మాట్లాడుతూ హ్యూస్టన్‌వాసుల హృదయాల్లో శ్రీరాముడు కొలువైవున్నాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment