అయోధ్యలో ఈనెల 22న జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపనపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుగానే అమెరికాలో రామభక్తులు ఇప్పటికే కార్లు, బైక్ ర్యాలీలు చేపట్టారు. ఇంతేకాకుండా జనవరి 22 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రముఖ టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానున్నది.
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అమెరికన్ యూనిట్ అక్కడి పది రాష్ట్రాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ మొత్తం 40 హోర్డింగ్‌లను ఏర్పాటు చేసినట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ , జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్టులు ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుండి అరిజోనా, మిస్సోరీలలోని ఆలయాలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు.
న్యూజెర్సీలో పలువురు హిందువులు కారు ర్యాలీలు, మేళాల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని అమెరికా వీహెచ్‌పీ జాయింట్ సెక్రటరీ తేజా షా తెలిపారు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చికాగోలకు చెందిన రామభక్తులు భారతదేశానికి వచ్చేందుకు ఇప్పటికే తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment