answers
-
కాళేశ్వరం కమిషన్‌కు కీలక విషయాలు వెల్లడించిన ఇంజినీర్లు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ,ఎస్ఈ శనివారం(సెప్టెంబర్21)నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు.మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకుగాను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కమిషన్‌కు విభిన్న సమాధానాలు చెప్పడం గమనార్హం.బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది.రెండు మూడు నెలలకొకసారని ఒకరు,అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్‌కు చెప్పారు.వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు.తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి.. కాళేశ్వరం తెలంగాణకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్‌రావు -
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వెయ్యి రూపాయల పథకానికి మరికొన్ని నెలలు?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని మహిళలకు అధికార ఆప్ ప్రభుత్వం నెలనెలా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం అమలుకు మరికొన్ని నెలలు పట్టేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ పథకం గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని మహిళలకు ఈ వెయ్యి రూపాయల సహాయం ఎలా అందజేయనున్నామో, అందుకు ఉన్న నియమాలు ఏమిటో కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రభుత్వ పెన్షన్ అందుకోని, ప్రభుత్వ ఉద్యోగంలో లేని, పన్నులు చెల్లించని మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం మహిళలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అధికారులు పరిశీలించాక ఆ మహిళలకు ప్రతినెలా డబ్బు అందుతుంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో చర్చించాక ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే ఈ పథకం అమలు కావడానికి కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. -
చిటికేస్తే జరిగిపోవాలి!
‘నన్ను ఏమైనా అడగండి. ఆసక్తిగా అనిపించిన ప్రశ్నలకు జవాబు చెబుతా’ అన్నారు రష్మికా మందన్నా. అంతే... ప్రశ్నల వర్షం కురిపించారు ఫ్యాన్స్. నచ్చిన టీవీ సిరీస్, తనలో తనకు నచ్చని అలవాటు, సూపర్ పవర్ ఉంటే ఏం చేస్తారు? స్ఫూర్తి మంత్రం? ఇలాంటివన్నీ చెప్పారు రష్మిక. ఆ విశేషాలు. మీకెలాంటి సూపర్ పవర్ కావాలని కోరుకుంటారు? ఒక్క చిటికేస్తే ఎవరేం కోరుకున్నా అది జరిగేలాంటి పవర్ ఉండాలని కోరుకుంటాను. హోటల్స్‌లో సరదాగా ? ఏదైనా దొంగతనం చేశారా? షాపు బావుంటే దొంగలిస్తాను. అలాగే ఓసారి దిండు కవర్స్ బావున్నాయని దొంగలించాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా అపరాధ భావన కలుగుతోంది. నటిగా కెమెరా ముందుకు వెళ్లడం ఎలా అనిపిస్తుంది? షూటింగ్‌కి వెళ్లడం అంటే ప్రతిరోజూ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లినట్టే. డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సన్నివేశానికి తగ్గట్టు బాగా యాక్ట్ చేయాలి. అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. అలాగే చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటుంది. లాక్డౌన్ వల్ల షూటింగ్‌కి దూరమయ్యాను. మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. లాక్డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయంలో మానసికంగా కుంగిపోకుండా ఎలా జాగ్రత్తపడుతున్నారు? ప్రతీ ఒక్కరికీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ కరోనా అనేది ఎప్పటికీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరోనా మొత్తం అంతం అయ్యాక లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేదే? అని మాత్రం బాధపడకూడదు. అందుకే ఎవరి వృత్తికి సంబంధించి వారు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే తర్వాత బాధపడే స్కోప్ ఉండదు. మీ స్ఫూర్తి మంత్రం ఏంటి? కెరీర్లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలని నా ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోను. అన్నీ సాధించాలనుకుంటాను. నాకు నేను హద్దులు పెట్టుకోను. బాలీవుడ్ సినిమాలు చేయాలి. హాలీవుడ్ సినిమాలు చేయాలి. ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులే వేస్తున్నా. కానీ నా కలలను చేరుకుంటా. నెగటివిటీని ఎలా డీల్ చేస్తారు? ఇంతకు ముందు నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అయ్యేది కాదు. పట్టించుకోకుండా ఉండలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నెగటివిటీ నా దాకా రాలేదు... రానివ్వను. వచ్చినా పట్టించుకోను. నా మిత్రులు, నా కుటుంబం, నా టీమ్ అందరూ నెగటివిటీ నా దగ్గరకు రాకుండా సహాయపడుతుంటారు. మీలో మీకు చిరాకుగా అనిపించే లక్షణం? చాలా ఉన్నాయి. ప్రతి దానికీ ఎక్కువ ఆలోచిస్తా. బాధపడతాను. ఇక ఎటువంటి సందర్భంలో అయినా నవ్వుతూనే ఉంటా. అది చాలా మందికి అయోమయంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు బాగా ఒత్తిడిగా అనిపిస్తే హైపర్ అవుతాను. నా మెంటాల్టీ కొంచెం విచిత్రంగా ఉంది కదూ? నేను ఏలియన్ అనుకుంటా (నవ్వుతూ). మీ స్ట్రెస్‌బస్టర్ ఏంటి? బాగా స్ట్రెస్ అనిపిస్తే వర్కౌట్స్ చేస్తా. అలాగే సంగీతం వింటాను. పిచ్చిపట్టినట్టు డ్యాన్స్ చేస్తాను. అంతే.. ఒత్తిడి మాయం అయిపోతుంది. -
ర్యాపిడ్ ఫైర్‌లో రానా ఆన్సర్స్
సౌత్ సినీ పండుగ సైమా అబుదాబిలో ఘనంగా జరిగింది. దక్షిణాది సినీ ప్రముఖులు హాజరైన ఈ వేదికపై యంగ్ హీరో రానా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు రానా చెప్పిన సమాధానాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్‌నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్‌గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్‌కు మాత్రమే ఇస్తా అన్నాడు. జీవితాంతం తనకు ఒకే ప్రేక్షకుడు ఉంటే అది మా నాన్నే అన్న రానా, ఒకే స్టార్‌తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్‌ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు. -
వివరణను డిమాండ్ చేసిన ఫోన్ పే
ముంబై: ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే తన సేవలను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వక్తం చేసింది..ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ సేవల్ని అడ్డుకోవడంపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వివరణ కోరింది. బ్యాంక్ చర్యపై నిరసన వ్యక్తం చేసిన ఫోన్ పే వివరణ యివ్వాల్సిందిగా బ్యాంకును డిమాండ్ చేసింది. 20,000 లకుపైగా యూపీఐ ఆధారిత సేవల ద్వారా రూ. 5కోట్ల మేర ట్రాన్స్ క్షన్ విఫలమైనట్టు ఆరోపణలపై స్పందించినసంస్థ బ్యాంకింగ్ దిగ్గజం నుంచి సమాధానాన్ని కోరింది. కనీస వివరణ, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే తమ వాలెట్ కస్టమర్ లింక్ ను బ్లాక్ చేసిందని మండిపడింది. ఎన్ పీసిఐ నిబంధనలను తాముపాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఎన్పీసీఐ వివరణాత్మక మార్గదర్శకాలు, విధానాలను తాము అనుసరిస్తున్నామని 100 కు పైగా టెస్ట్ కేసులను పరిశీలించినట్టు ఫోన్ పే సీఈవో సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. తాము యూపీఐ మార్గదర్శకాలను పాటించడంలేదని భావిస్తే కనీసం రెండు నెలల ముందు తమకు గానీ, ఎన్ పీసీఐ కిగానీ సమాచారం అందించాల్సిఉందని తెలిపారు. ఈ విషయంపై కూర్చుని నిర్ణయించుకుంటే బావుండేదన్నారు. ఇప్పటికైనా తమతో సమస్యలపై సంప్రదించాలని బ్యాంకు ను విజ్ఞప్తి చేసింది. తద్వారా వాటిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సమీర్ నిగమ్ తన వినియోగదారులకు ఒక బహిరంగ లేఖ రాశారు వివరణాత్మక సర్టిఫికేషన్, బలహీనతల అంచనా, థర్డ్ పార్టీ అప్లికేషన్ టెస్టింగ్ తరువాత మాత్రమే వాలెట్ ను లాంచ్ చేసినట్టు నిగమ్ వినియోగదారులకు తన లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్‌గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల కారణాలతో ఫోన్‌పే ఈ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. -
జవాబు పత్రాలు తండ్రికివ్వరా?
విశ్లేషణ ఒక తండ్రి విజయ్ కుమార్ మిశ్రా తన కుమారుడు (కేంద్ర ద్వితీయ స్థాయి విద్యామండలి) సీబీఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి లెక్కలు, విజ్ఞాన శాస్త్రం పరీక్షలలో రాసిన జవాబుపత్రాల ప్రతులను ఇమ్మని సమాచార హక్కు చట్టం కింద కోరారు. తమ నియమాల ప్రకారం పరీక్ష రాసిన కొడుకే పత్రాలు అడగాలి కాని ఆయన తండ్రి అడగడానికి వీల్లేదనీ కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ పట్టుపట్టింది. పరీక్ష రాసిన విద్యార్థులకు జవాబు పత్రాల సమాచారం ఇవ్వబోనని సుప్రీంకోర్టు దాకా సీబీఎస్ఈ పోరాడింది. 2011లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం జవాబు పత్రాలు ఇచ్చితీరాలని సీబీఎస్ఈని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబు పత్రాలు ఇవ్వకూడదని, ఈ విషయంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఇ) ఇచ్చిన మినహాయింపు తమకు వర్తిస్తుందని సీబీఎస్ఈ చేసిన వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. పరోక్షంగా అనేకానేక ప్రతిబంధకాలు కల్పించి జవాబు పత్రాల సమాచారం నిరాకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయ్ కుమార్ మిశ్రాను కూడా ఈ విధంగానే వేధించారు. రెండో అప్పీలులో కమిషన్‌కు రాక తప్పలేదు. తమ నియమాల ప్రకారం చివరి తేదీ దాటిన తరవాత దరఖాస్తు వచ్చిందని, అభ్యర్థి కాకుండా అతని తండ్రి అడిగాడు కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ వాదించింది. సంతకం పరిశీలించి అడ్మిట్ కార్డు దరఖాస్తులో ఒక సంతకం ఉంటేనే ఇస్తామని, కానీ మరెవరో సంతకం చేస్తే ఇవ్వబోమని చెప్పింది. ఫలి తాలు ప్రకటించిన పది రోజుల్లో మాత్రమే అడగాలని, దానికి తగిన రుసుము అనుబంధాలు ఇస్తేనే జవాబు కాపీలు ఇస్తామన్నారు. సొంతంగా అభ్యర్థి తన దస్తూరీతో అండర్ టేకింగ్ ఇవ్వాలి. సంతకాల్లో మార్పు ఉండరాదు. పరీక్షించిన అధికారిని సవాలు చేయడానికి వీల్లేదు. కూడికలో తప్పులు విద్యార్థి మాత్రమే పది రోజుల్లో ఎత్తిచూపాలి. మళ్లీ జవాబులు పరిశీలించాలని కోరడానికి వీల్లేదు. పరీక్షించిన అధికారి పేరును కనిపిం చకుండా చేస్తారు. ఆ విధంగా తీసుకున్న జవాబు పత్రా లను ప్రదర్శించడానికి గాను ఏ సంస్థకూ ఇవ్వకూడదు, వార్తాపత్రికలకు ఇవ్వకూడదు, వాణిజ్య అవసరాలకు వాడుకోకూడదు. ఆ విధంగా చేయబోనని ఒక వాగ్దాన పత్రం (అండర్ టేకింగ్)పైన సంతకం చేయాలి. అప్పు డు మాత్రమే జవాబు పత్రాలు ఇస్తామని, లేకపోతే లేదని వాదించారు. జవాబు పత్రాలు కోరిన సమయంలో సీబీఎస్ఈ వద్ద ఆ పత్రాలు ఉంటే వాటిని నిరాకరించడానికి సెక్షన్ 8, 9 కింద మినహాయింపులు వర్తిస్తాయా లేదా అని మాత్రమే పరిశీలించాలి. జవాబు పత్రాల ప్రతులను తయారు చేసే ఖర్చును తీసుకోవాలి. అదీ ఆర్టీఐ నియ మాల ప్రకారమే. జవాబులు పునఃపరిశీలించాలని కోరే హక్కు వదులుకుంటేనే ఇస్తామని, జవాబులు ఎవ్వరికీ చూపబోమని, వాణిజ్య ప్రయోజనాలకు వాడు కోబో మని, ప్రింట్ మీడియాకు ఇవ్వబోమని వాగ్దాన పత్రాలపైన సంతకాలు చేయాలనడం, హక్కులు వాడు కోకుండా ఒత్తిడి చేయడం అవుతుందని, ఇందువల్ల ఆ షరతులన్నీ అసమంజసమైన షరతులనీ, సమాచార హక్కును నిరాకరించడానికి కల్పించిన చట్టవ్యతిరేక పరిస్థితులని కమిషన్ భావించింది. పునః మూల్యాంకనం చేయాలని కోరే హక్కు సహజంగా పరీక్ష రాసిన విద్యార్థికి లభిస్తుంది. కేవలం జవాబు పత్రాన్ని అడిగిన విద్యార్థి ఆ హక్కును వదులుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వ సంస్థకు న్యాయం కాదు. ఒకవేళ అత్యుత్తమ జవాబు పత్రమైతే, ఆ విద్యార్థి తన జవాబు పత్రాన్ని ఇతరులకు ఎందుకు చూపగూడదు? ఆ విద్యార్థికి పాఠాలు చెప్పిన విద్యా సంస్థ ఆ జవాబు పత్రాన్ని గ్రంథాలయంలో ఎందుకు పెట్టగూడదు? మంచి జవాబు రాసినా మార్కులు ఇవ్వకపోతే సీబీఎస్ఈని ఎందుకు విమర్శించకూడదు? అసలు సమాచారం కోరేదే అవసరమైతే వినియోగించడానికి. ఏ విధం గానూ వినియోగించకూడదని షరతులు పెట్టే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? మీడియాకు ఇవ్వకూడదని షరతు విధించడం రాజ్యాంగం ఆర్టికల్ 19 (1)(ఎ) కింద పౌరులకు ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని, అభివ్యక్తి స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అభ్యర్థి తండ్రికి తన కుమారుడి జవాబు పత్రాలు కోరే హక్కు లేదా? అభ్యర్థి మైనర్ బాలకుడే అవుతాడు కనుక అతని సహజ సంరక్షకుడైన తండ్రికి తనయుడి తరపున చట్టపరమైన అన్ని హక్కులు కోరే అధికారం ఉంటుందని చట్టాలు వివరిస్తున్నప్పుడు ఆ హక్కులను నిరాకరించే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? సహజ సంరక్షకుడి హోదాలో తండ్రికి తన కుమారుడి విద్యా ప్రయోజనాలను రక్షించే అధికారం ఉండి తీరు తుంది. ఒకవేళ తన కొడుకు జవాబు పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఆయన అనుమానిస్తే ఆ పరిస్థితిని సవరించి న్యాయం కోరే అధికారం తండ్రికి ఉంది. కుమారుడి జవాబు పత్రాలు ఇవ్వడానికి నిరాకరించడం చట్టవ్యతిరేకం. అసమంజసమైన షరతులు విధించడం ద్వారా అభ్యర్థి సమాచార హక్కును పరిమితం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా వేధించినందుకు 25 వేల రూపా యల పరిహారం చెల్లించాలంటూ జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ ఆదేశించింది. (విజయకుమార్ మిశ్రా వర్సెస్ సీబీఎస్ఈ పాట్నా, CIC/RM/A/2014/0000014-SA లో డిసెంబర్ 3న నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com -
విత్తనాలు రాలే.. పుస్తకాలు రాలే !
- బాబు ప్రశ్నలకు వెనుకవైపు సమాధానాలివీ పలమనేరు: పలమనేరులో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్న పలు కార్యక్రమాల్లో ఆయన అడిగిన ప్రశ్నలకు వెనుకవైపు జనం నుంచి ‘నో.నో..’ అనే సమాధానాలు అధికంగా వినబడ్టాయి. దీంతో సంబంధిత శాఖలకు చెందిన అధికారులు బిక్కమొహం పెట్టాల్సి వచ్చింది. బొమ్మిదొడ్డిలో అధికారులు ముందుగా తర్ఫీదునిచ్చి ఏర్పాటుచేసిన సభలో రైతులు ఒకరకంగా సమాధానం చెప్పగా బ యట ఉన్నవారు మాత్రం బాబన్నా వేరుశెనగ విత్తనాలు లేవన్నా అంటూ గట్టిగా అరిచారు. ఇక కనికల చెరువులో ఆయన రైతులతో మటడ్లాడుతుండగా వెనుకవైపున్న వారు పలుమార్లు అభ్యంతరాలు చెప్పబోగా అ క్కడున్న అధికారులు, పోలీసులు వారి నోర్లు మూయిం చారు. స్టేజ్‌పైకి వెళ్లిన రైతులు, మహిళలు బాబు అడిగే ప్రశ్నలతో సంబంధం లేకుండా అధికారులు చెప్పించిన డైలాగులు మాత్రం కంటస్థం చేసి మరీ ఒప్పించారు. బడిపిలుస్తోంది కార్యక్రమంలో పిల్లలూ మీకు మొత్తం పుస్తకాలు అందాయా.. అని బాబు అడగ్గా అధికారులు స్టేజ్‌పైనున్నవారు మాత్రం అందాయని సమాధానం చెప్పా రు. కా నీ సభలోని విద్యార్థులు ‘లేదు.. లేదు..’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో లేదు అనేవారు చేతులెత్తాలని సీఎం కోరగా చాలామంది చేతులెత్తడంతో విద్యాశాఖ విస్తుబోయింది. పొలం పిలుస్తోంది కోసం తీసుకొచ్చిన ఎద్దులకు మేతలేక పాపం అక్కడే ఆకలితో ఆలమటించాయి. బాబు ఈవైపు మడక దున్నుతోండగా పక్కనే ఎండిన బోరు ఉన్నప్పటికీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఆఘమేఘాలపై ఏర్పాట్లుచేశారు. ఓవైపు కార్యక్రమం మొదలైనప్పటికీ కొన్ని పనులు జరుగుతూనే కనబడ్డాయి. మరో వైపు పట్టణంలోని పలు దుకాణాలను పోలీసులు మూసివేయించారు. దీంతో తమ కూలీ పోగొట్టుకున్నామని పలువురు చిన్న వ్యాపారులు ఆవేదన చెందారు. -
ఇంటర్ సంస్కృతం పేపర్-2లో మాతృభాషలో సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్న విద్యార్థులు పేపర్-2లోని ప్రశ్నలకు సమాధానాలను మాతృభాషలో రాసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్-2లోని 1, 2, 3 ప్రశ్నలకు విద్యార్థులు వారి మాతృభాష, లేదా వారు ఎంచుకున్న భాషలో సమాధానాలు రాయవచ్చని వివరించారు. 2015 మార్చి పరీక్షలనుంచి అమలయ్యే ఈ విధానం అయిదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. -
నేడే ఎంసెట్
హాజరుకానున్న విద్యార్థులు 25,355 మంది నిమిషం ఆలస్యమైనా అనుమతించరు బాల్‌పాయింట్ పెన్‌తోనే సమాధానాలు పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు నగరంలో 25,355 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నగరంలో ఇంజినీరింగ్‌కు 36 కేంద్రాల్లో 18,976 మంది, మెడిసిన్‌కు 13 కేంద్రాల్లో 6,379 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రాంతీయ సమన్వయకర్త ఆచా ర్య కె.వెంకట సుబ్బయ్య తెలిపా రు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్‌కు పరీక్ష జరగనుంది. నిరంతర పరిశీలన పరీక్షలకు నిరంతర పర్యవేక్షణ జరపనున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడు, నగరానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలకు అదనంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉంటారు. ప్రతి 500 విద్యార్థులకు ఒక పరిశీలకుడిని, ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందుగా అనుమతిస్తారు. దరఖాస్తులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా పరీక్ష కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరిచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్లైన్ దరఖాస్తు పత్రం కాపీని తీసుకురావాలి. పరీక్ష కేంద్రాలివే... నగరంలో ఇంజినీరింగ్‌కు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల న్యూ క్లాస్రూమ్ కాంప్లెక్స్, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ సైన్స్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం, ఏయూ సోషల్ సెన్సైస్ భవనం, ఏయూ ఆర్ట్స్ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-4( ఆర్ట్స్ అండ్ కామర్స్) డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-5 ( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-6( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-2, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల, ప్రిజమ్ డిగ్రీ, పీజీ కళాశాల, బీవీకే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పైడా కళాశాల, రెడ్నం గార్డెన్స్, శ్రీగౌరి డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ మేరీస్ సెంటినరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ జోసఫ్స్ అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బుద్ద రమేష్ బాబు డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్, వి.వి.ఆర్. కె.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల, తాటిచెట్టపాలెం, డాక్టర్ వి.ఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సమతా కళాశాల, జీవీపీ డిగ్రీ కళాశాల, ఎస్.వి.వి.పి.వి.ఎం.సి.కళాశాల, విశాఖ వేలీ పాఠశాల, ఎస్వీపీ ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మెడిసిన్‌కు... మెడిసిన్‌కు పైన పేర్కొన్న ఏయూలోని పది కేంద్రాలతో పాటు లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రెండు కేంద్రాలు, వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కళాశాలలో ఒక కేంద్రంలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులూ ఇవి పాటించండి : పరీక్ష సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. విద్యార్థులు ఓఎంఆర్ పత్రంపై సమాధానాలు గుర్తించే సమయంలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్ల్ తీసుకు రాకూడదు. ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు ఉన్నాయి. పూర్తి నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు మానసిక బలాన్ని అందించే విధంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయి. -ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి -
మాదిరి ప్రశ్నలు
భారమితిలో పాదరస మట్టం పెరగడం దేనికి సూచిక..? 1) సాధారణ వాతావరణ పీడనానికి 2) సాధారణ వాతావరణ పీడనం కంటే ఎక్కువ పీడనానికి 3) సాధారణ వాతావరణ పీడనం కంటే తక్కువ ీపీడనానికి 4) శూన్య ీపీడనానికి 2. ఏ నియమం ఆధారంగా జలాంతర్గామి పనిచేస్తుంది..? 1) బాయిల్ నియమం 2) బెర్నౌలీ నియమం 3) ప్లవన సూత్రాలు 4) పాస్కల్ నియమం 3. ప్యారాచూట్ వేగం తగ్గడానికి కారణం? 1) స్నిగ్ధత 2) కేశనాళికీయత 3) తలతన్యత 4) గురుత్వాకర్షణ బలం 4. స్పర్శకోణం గరిష్టంగా ఉన్న ద్రవ పదార్థం? 1) ఆల్కహాల్ 2) బెంజీన్ 3) నీరు 4) పాదరసం 5. {Mిమి సంహారక మందులను చల్లేందుకు ఉపయోగించే స్ప్రేయర్ పనిచేయడంలో ఇమిడి ఉన్న నియమం? 1) పాస్కల్ నియమం 2) బాయిల్ నియమం 3) శక్తినిత్యత్వ నియమం 4) ఫారడే నియమం 6. కేశనాళికీయతకు సంబంధం లేనిది? 1) ద్రవాలను స్పాంజి పీల్చుకోవడం 2) ఒయాసిస్‌లు ఏర్పడడం 3) కూల్‌డ్రింక్ స్ట్రా పనిచేయడం 4) మొక్కల వేళ్ల ద్వారా నీరు పైకి ఎగబాకడం 7. చంద్రుడిపై స్వేచ్ఛగా వదలివేసిన బెలూన్ ఎన్ని మీటర్ల ఎత్తుకు ఎగురుతుంది? 1) 9.8 మీటర్లు 2) 19.6 మీటర్లు 3) 100 మీటర్లు 4) 0 మీటర్లు సమాధానాలు 1) 2; 2) 3; 3) 1; 4) 4; 5) 1; 6) 3; 7) 4.