సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్న విద్యార్థులు పేపర్-2లోని ప్రశ్నలకు సమాధానాలను మాతృభాషలో రాసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్-2లోని 1, 2, 3 ప్రశ్నలకు విద్యార్థులు వారి మాతృభాష, లేదా వారు ఎంచుకున్న భాషలో సమాధానాలు రాయవచ్చని వివరించారు. 2015 మార్చి పరీక్షలనుంచి అమలయ్యే ఈ విధానం అయిదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు.
ఇంటర్ సంస్కృతం పేపర్-2లో మాతృభాషలో సమాధానాలు
Published Thu, Nov 20 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement