సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ,ఎస్‌ఈ శనివారం(సెప్టెంబర్21)నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు.మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది.
ఈ ప్రశ్నలకుగాను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కమిషన్‌కు విభిన్న సమాధానాలు చెప్పడం గమనార్హం.బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది.రెండు మూడు నెలలకొకసారని ఒకరు,అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.
అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్‌కు చెప్పారు.వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు.తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి.. కాళేశ్వరం తెలంగాణకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment