ముంబై: ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే తన సేవలను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వక్తం చేసింది..ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ సేవల్ని అడ్డుకోవడంపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వివరణ కోరింది. బ్యాంక్ చర్యపై నిరసన వ్యక్తం చేసిన ఫోన్ పే వివరణ యివ్వాల్సిందిగా బ్యాంకును డిమాండ్ చేసింది. 20,000 లకుపైగా యూపీఐ ఆధారిత సేవల ద్వారా రూ. 5కోట్ల మేర ట్రాన్స్ క్షన్ విఫలమైనట్టు ఆరోపణలపై స్పందించినసంస్థ బ్యాంకింగ్ దిగ్గజం నుంచి సమాధానాన్ని కోరింది.
కనీస వివరణ, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే తమ వాలెట్ కస్టమర్ లింక్ ను బ్లాక్ చేసిందని మండిపడింది. ఎన్ పీసిఐ నిబంధనలను తాముపాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఎన్పీసీఐ వివరణాత్మక మార్గదర్శకాలు, విధానాలను తాము అనుసరిస్తున్నామని 100 కు పైగా టెస్ట్ కేసులను పరిశీలించినట్టు ఫోన్ పే సీఈవో సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. తాము యూపీఐ మార్గదర్శకాలను పాటించడంలేదని భావిస్తే కనీసం రెండు నెలల ముందు తమకు గానీ, ఎన్ పీసీఐ కిగానీ సమాచారం అందించాల్సిఉందని తెలిపారు. ఈ విషయంపై కూర్చుని నిర్ణయించుకుంటే బావుండేదన్నారు. ఇప్పటికైనా తమతో సమస్యలపై సంప్రదించాలని బ్యాంకు ను విజ్ఞప్తి చేసింది. తద్వారా వాటిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సమీర్ నిగమ్ తన వినియోగదారులకు ఒక బహిరంగ లేఖ రాశారు వివరణాత్మక సర్టిఫికేషన్, బలహీనతల అంచనా, థర్డ్ పార్టీ అప్లికేషన్ టెస్టింగ్ తరువాత మాత్రమే వాలెట్ ను లాంచ్ చేసినట్టు నిగమ్ వినియోగదారులకు తన లేఖలో పేర్కొన్నారు.
డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల కారణాలతో ఫోన్పే ఈ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
వివరణను డిమాండ్ చేసిన ఫోన్ పే
Published Tue, Jan 17 2017 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Advertisement