ఐసీఐసీఐ బ్యాంక్ (ఫైల్ ఫోటో)
ముంబై : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. జనరల్, సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. 7 రోజుల నుంచి 365 రోజుల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను వార్షికంగా 4 శాతం నుంచి 6.50 శాతం వరకు ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు స్వల్పకాలిక ఎఫ్‌డీ రేట్లను 4.50 శాతం నుంచి 7.00 శాతం శ్రేణిలో నిర్ణయించింది. 2 ఏళ్ల ఒక్క రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ బెస్ట్ ఎఫ్‌డీ రేటును ఆఫర్‌చేస్తోంది. అది 7.75 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలకు స్పెషల్ వడ్డీరేటును బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. 5 ఏళ్ల ఒక్క రోజు నుంచి 10 ఏళ్ల వరకున్న దీర్ఘకాలిక డిపాజిట్లపై వచ్చే ఎఫ్‌డీ వడ్డీరేట్లు మంచి రిటర్నులను అందిస్తున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 10 ఏళ్ల కాలవ్యవధిల ఉన్న ఎఫ్‌డీ డిపాజిట్ల రేట్లను 7.00 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు దీర్ఘకాలిక ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. 5 ఏళ్ల టాక్స్ సేవర్ ఎఫ్‌డీ(రూ.1.50 లక్షల వరకు) వడ్డీ రేట్లుగా జనరల్ కేటగిరీకి 7.25 శాతంగా, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతంగా నిర్ణయించినట్టు బ్యాంక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment