కడప రూరల్: నమ్మించి మోసగించిన గల్ఫ్ ఏజెంట్ తన భార్యను సౌదీ సేట్‌కు అమ్మేశాడని ఓబులవారిపల్లె మండలం జీవీ పురం ఎస్సీ కాలనీకి చెందిన భర్త సాల్వ వెంకటరమణ ఆరోపించారు. తన భార్య ప్రాణాపాయ స్ధితిలో ఉందని ఆమెను ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. శనివారం సాయంత్రం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరుకు చెందిన గల్ఫ్ ఏజెంట్ తమను నమ్మించి మోసగించాడని ఆరోపించారు.
తన భార్యను 2017 ఆగస్టు 4వ తేదీన సౌదీ దేశ సేట్‌కు అమ్మేశాడని ఆరోపించారు. అక్కడ తన భార్యను సేట్ కుటుంబ సభ్యులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇండియాకు రప్పించాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కన్నీటి పర్యంతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తమను మోసగించిన ఏజెంట్‌పై చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment