గల్ఫ్ బాధితులు గోపి, సుభాష్
కోరుట్ల: నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామం, జయరాం తండాకి చెందిన రాథోర్ సుభాశ్(45), జాదవ్(44) గోపి కౌలు రైతులు. ఐదేళ్ల క్రితం సౌదీకి వలసవెళ్లారు. కంపెనీలో జీతాలు సరిగా అందకపోగా, బెదిరింపులకు గురై ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్‌పల్లెకు చెందిన సిమ్మట మధుకు సౌదీలో లేబర్ సప్లయ్ కాంట్రాక్టు కంపెనీ ఉంది. ఆ కంపెనీలో చేరే సమయంలో వీరు ఒక్కొక్కరు రూ.2.20 లక్షలు చెల్లించారు. వసతి, భోజనానికి ఏడాదికి రూ.లక్ష కంపెనీకి ఇవ్వాలి. సప్లయ్ కంపెనీ వీరికి నెలకు రూ. 35 నుంచి రూ. 40 వేల జీతం ఇవ్వాలి. ఈ ఏడాది మార్చి నుంచి కంపెనీ జీతాలు ఇవ్వలేదు. ఇంటికి వెళ్లనివ్వలేదు. జీతాలు ఇవ్వమని అడిగితే సౌదీలో ఉన్న గూండాలతో బెదిరిం పులు.. కొట్టించడం వంటి దౌర్జన్యాలకు దిగారు. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకొని సెలవుపై వెళ్లి వస్తామని మూడు నెలల క్రితం ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన 80 మంది సదరు కంపెనీ నుంచి వచ్చేశారు. ప్రస్తుతం మరో 350 మంది అదే కంపెనీలో ఉండి జీతాలు లేక.. కంపెనీ యజమానిని గట్టిగా అడగలేక.. ‘సాక్షి’కి ఓ లేఖ పంపారు.
కాంట్రాక్టు కంపెనీ దగా..
సిమ్మట మధు సౌదీలో రెండు కాంట్రాక్టు సప్లయ్స్ కంపెనీలను ఏర్పాటు చేశాడు. మొదట కాంట్రాక్టు కంపెనీ బాగానే డబ్బులు చెల్లించినప్పటికీ ఈ మధ్యకాలంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిన్నర క్రితం వేతనం తగ్గించింది. ఈ ఏడాది మార్చినుంచి అసలు జీతాలే చెల్లించడంలేదు. పనులు చేయించుకున్న సంస్థలు డబ్బులు చెల్లించినా సప్లయ్స్‌కాంట్రాక్టర్ తమకు డబ్బులు ఇవ్వడం లేదని లేబర్‌లు ఆరోపిస్తున్నారు.
వలస జీవులపై గూండాయిజం..
6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై కార్మికుల్లో కొంతమంది యజమానిని నిలదీస్తే అక్కడి గూండాలతో బెదిరిస్తున్నారు. కంపె నీలో ఉండే ఓ రూంకు తీసుకెళ్లి గూండాలతో కొట్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో పెట్టిస్తామని చెప్పి బెదిరిస్తు న్నట్లు మొరపెట్టున్నారు. సౌదీకి చెందిన కొంతమంది గూండాలకు వేతనాలు ఇస్తూ కంపెనీలో ఉంచుకుని జీతాల కోసం గొడవ చేస్తున్న లేబర్లపై దౌర్జన్యానికి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment