ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు | First AC passengers in Express trains will be provided with blankets in covers. | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు

Published Sun, Jun 11 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు

ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు

అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అమలు
సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్‌ ఏసీ ప్రయాణికులకు సాధారణంగా అందజేస్తున్న దుప్పట్లను ఇక నుంచి ప్యాక్‌ చేసి అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ అర్జున్‌ ముండ్య, ఇతర అధికారులు.. ప్యాక్‌ చేసిన దుప్పట్లను ప్రయాణికులకు అందజేశారు. ఇక నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌ల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు దుప్పట్లను కవర్లలో పెట్టి అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement