pack
-
లేబుల్.. డేంజర్ బెల్ చదివితే ఉన్న మతి పోతుంది!
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్సింగ్కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుకకాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లోమ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలాఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.దేశమా.. లేబుల్ చదువు...‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.కోర్టు కేసులు ఎదుర్కొంటూప్యాకేజ్డ్ ఫుడ్లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి. -
టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు?
దేశంలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, మధ్యలో లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. వన్ కంట్రీ- వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈవీఎం వినియోగానికి బదులుగా ఎన్వలప్ ఉపయోగించే ఓటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్నే టెండర్ ఓటింగ్ అని అంటారు. భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కు భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. దేశపౌరుడు వేసే ఓటు అటు దేశ, ఇటు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ సమయంలో చాలాసార్లు నకిలీ ఓట్లు కనిపిస్తుంటాయి. ఒకరి ఓటును మరొకరు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే టెండర్ ఓటింగ్ అనే నిబంధన ఉంది. పోలింగ్ జరుగుతున్న రోజున మీరు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మీ ఓటు ఇప్పటికే ఎవరో వినియోగించారని చెప్పారనుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు టెండర్ ఓటింగ్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దీని కోసం ముందుగా మీరు మీ గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. మీరు ఓటు వేయలేదని ముందుగా వారికి చెప్పాలి. అప్పుడు వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీరు మీ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఈవీఎంలపై ఓటు వేయనప్పటికీ, బ్యాలెట్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే టెండర్ ఓటింగ్ అంటారు. అటువంటప్పుడు మీకు అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు ఉండే ఒకపత్రం అందజేస్తారు. అప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో అదే స్లిప్‌లో టిక్ చేయాలి. దీని తరువాత ప్రిసైడింగ్ అధికారి ఆ స్లిప్‌ను ఒక కవరులో సీలు చేసి, పెట్టెలో భద్రపరచి, కౌంటింగ్ రోజున దానిని లెక్కిస్తారు. ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? -
బ్యూటిప్స్
♦ ఒక్కొక్కసారి స్నానం చేసినా, ఏ సబ్బుతో ముఖం కడిగినా తాజాగా ఉన్నట్లనిపించదు. కాలుష్యం చర్మరంధ్రాల్లో పట్టేసినప్పుడు, జిడ్డు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ సమస్య పోయి ముఖం తాజాగా, శుభ్రంగా ఉండాలంటే బొప్పాయి గుజ్జు చక్కని మందు. మామూలుగా ప్యాక్‌కు వాడేకంటే ఎక్కువ మోతాదు గుజ్జు అవసరమవుతుంది. ముందుగా సగం గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తుడిచేసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తరువాత మిగిలిన గుజ్జుతో ప్యాక్ వేయాలి. ప్యాక్ ఆరిన తరువాత చన్నీటితో కడగాలి. ♦ స్వచ్ఛమైన బాదం నూనె చర్మానికి చక్కని టానిక్‌లా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, లోషన్లకు బదులుగా ఆల్మండ్ ఆయిల్ వాడకం మంచి ఫలితాలనిస్తుంది. చలికాలంలో అన్ని రకాల చర్మతత్త్వాల వాళ్లూ దీనిని వాడవచ్చు. ముఖంతోపాటుగా చేతులు, కాళ్లకు కూడా (చలికి ఎక్స్పోజ్ అయ్యేంత వరకు) రాస్తుంటే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, చర్మం మీదున్న మచ్చలు, గీతల వంటివి తొలగిపోతాయి. -
ఫ్లవర్ ప్యాక్
బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చేమంతి రెక్కలు ఒక కప్పు, ఉడికించి చిదిమిన క్యారట్ ఒక కప్పు, వీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. అర కప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చేమంతి రెక్కలు వేసి మరిగించి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారట్లో వీట్‌జెర్మ్ ఆయిల్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని, సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆక్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. -
హోమ్ ప్యాక్స్
జుట్టురాలడం, చుండ్రు, పొడిబారడం వంటì సమస్యలకు హెర్బల్ షాంపూలు, నూనెలు వాడినప్పటికీ సరైన ఫలితం రాదు. ఇలాంటప్పుడు.. మానసిక ఒత్తిడి, విటమిన్ లోపాలు, మినరల్స్, ఐరన్ శరీరానికి తగినంత అందకపోవడం, కాలుష్యం, వంశపారంపర్యం, నిద్రలేమి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, అనారోగ్యం.. సమస్యలు కారణాలు అవుతున్నాయేమో గమనించాలి. అలాగే.. ♦ నెలలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను జుట్టు కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఉసిరి, శికాకాయ, ఎండిన నిమ్మ ఆకులను కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ♦కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండడం, రోజూ రెండు నానబెట్టిన బాదంపప్పులు తింటూ ఉంటే వెంట్రుకలు రాలడం, పొడిబారడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. ♦ చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. వారానికి రెండు సార్లు పెరుగుతో మాడుకు మసాజ్ చేయాలి. అలాగే వెంట్రుకలంతా పట్టించాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. అలాగే షాంపూతో తలంటుకున్న తర్వాత, తడి జుట్టుకు తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించాలి. అయితే, కండిషనర్‌ని మాడుకు కాకుండా కేవలం వెంట్రుకలు మాత్రమే పట్టించాలి. ♦ పొల్యూషన్ కూడా వెంట్రుకులను నిస్తేజం చేస్తాయి. అందుకని బయటకు వెళ్లినప్పుడు తలకు క్యాప్‌తో కవర్ చేయాలి. అలాగే తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, బాదంపప్పు, పాల ఉత్పత్తులు, తాజా కాయగూరలను చేర్చండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది. -
బ్యూటిప్స్
టమాటాను మెత్తగా చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం సహజరంగుకు వస్తుంది. చర్మం బిగుతుగా మారి, ముడతలూ తగ్గుతాయి. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడిని నీళ్లలో వేసి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటితో జుట్టును తడిపి, ఆరనివ్వాలి. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు నిగనిగలాడుతుంటుంది. -
ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు
► అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అమలు సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ ఏసీ ప్రయాణికులకు సాధారణంగా అందజేస్తున్న దుప్పట్లను ఇక నుంచి ప్యాక్ చేసి అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండ్య, ఇతర అధికారులు.. ప్యాక్ చేసిన దుప్పట్లను ప్రయాణికులకు అందజేశారు. ఇక నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు దుప్పట్లను కవర్లలో పెట్టి అందించనున్నారు. -
ఆన్లైన్లో అమ్మ చేతి వంట!
ఈజీకుక్ ప్యాక్‌తో ఏ కూరలైనా వండటం తేలికే • ఫ్రెష్‌చాప్స్, బిగ్ బాస్కెట్లతోనూ ఒప్పందం • 2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి • ‘స్టార్టప్ డైరీ’తో ఈజీకుక్ ఫౌండర్ శశాంక్ కామిశెట్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్ గురించే మనకు తెలుసు. కానీ, అంతకంటే తొందరగా పూర్తయ్యే కూరలు కూడా వచ్చేశాయి. పాలకూర పచ్చడి నుంచిమొదలుపెడితే చోలే మసాలా, రొయ్యలు, చేపల పులుసు, గోంగూర మటన్, నాటుకోడి కూర వరకూ అన్ని రకాల శాకాహార, మాంసాహార వంటలూ సులువుగా వండేసుకునే వీలుంది. అదికూడా అమ్మ చేతి వంటంత రుచిగా! మరిన్ని వివరాలు ఈజీకుక్.ఇన్ ఫౌండర్ శశాంక్ కామిశెట్టి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఈజీకుక్ స్టార్టప్ కంటే ముందు హెల్త్‌కేర్ స్టార్టప్ ప్రారంభించా. రెండేళ్ల పాటు సేవలందించా. ఆ సమయంలో గమనించిందొక్కటే.. మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ ఉద్యోగస్తులు కావటంతో ఇంట్లో వంట చేసుకునే సమయం,ఓపిక రెండూ లేక రెస్టారెంట్లోనో, చైనీస్ ఫుడ్ సెంటర్లలోనో తినడం తప్పనిసరవుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అలాగని ఇంట్లో వంట చేసుకోవాలంటే అంత తేలిక్కాదు. ఇలాంటి సమస్యలేమీ లేకుండావంట గదిలో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేసుకోకుండా.. కేవలం ఒక్క గిన్నె, ఒక గరిటెతో ఏ కూరైనా వండుకోవటానికి వీలు కల్పించేదే మా ఈజీకుక్. అల్లం పద్మతో కలిసి ఈ ఏడాది మార్చిలో రూ.15 లక్షలపెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఈజీకుక్.ఇన్ను ప్రారంభించాం. కూరలు, వేపుళ్లు, పచ్చళ్లు కూడా.. ప్రస్తుతం ఈజీకుక్లో వెజ్, నాన్ వెజ్ కూరలతో పాటు కొన్ని రకాల వేపుళ్లు, పచ్చళ్లు కూడా అందిస్తున్నాం. శాకాహారంలో 26 రకాలు, మాంసాహారంలో 20 రకాలు, పలు రకాల వేపుళ్లు ఉన్నాయి. త్వరలోనే రైస్, స్వీట్ఐటమ్స్నూ తెస్తున్నాం. ప్రారంభ ధరలు చూస్తే పచ్చళ్లు 200 గ్రాములకు రూ.45, చికెన్ 380 గ్రాములకు రూ.105, మటన్ 380 గ్రాములకు రూ.220లుగా ఉన్నాయి. మేం పంపించే ప్రతి వస్తువూ నేరుగా రైతుల నుంచేకొంటాం. కారం, పసుపు, అల్లం, ధనియాల వంటి దినుసులను కూడా నేరుగా రైతుల దగ్గరి నుంచి కొని మెయిన్ కిచెన్‌లో మసాలాలు తయారు చేస్తాం. ప్రస్తుతానికైతే వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఆర్డర్ బుకింగ్చేయవచ్చు. త్వరలోనే ఐఓఎస్ యాప్‌నూ తెస్తున్నాం. ప్రస్తుతం గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లిహిల్స్, కొండాపూర్, కొత్తగూడ, మణికొండ, కూకట్పల్లి, నిజాంపేట, మదీనాగూడ, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నాం. ఫ్రెష్‌చాప్స్, బిగ్‌బాస్కెట్‌తో ఒప్పందం.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రెష్‌చాప్స్, బిగ్ బాస్కెట్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ప్రతి ఆర్డర్ మీద ఆయా సంస్థలకు 15–20 శాతం కమీషన్ వెళుతుంది. ప్రస్తుతం నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి.విస్తరణలో భాగంగా ఒక్కో ఏరియాకు ఒక్కో బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని నిర్ణయించాం. వీరేం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ విధానంలో వారిచ్చే ప్రతి ఆర్డర్‌పై కమీషన్‌ను పొందుతారు. విస్తరణ కోసం నిధులుసమీకరిస్తున్నాం. 2 నెలల్లో రూ.40 లక్షల నిధుల సమీకరణ పూర్తి చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
కేశాలకు ప్రొటీన్ ప్యాక్
బ్యూటిప్స్ ఒక బౌల్లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జ్యూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి, మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాల పాటు ప్యాక్‌ను ఆరనిచ్చి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. -
ముఖ కాంతికి...
బ్యూటిప్స్ ఎండ వల్ల ముఖం జిడ్డుగా అవుతుంది. దుమ్ము, ధూళి పడి చర్మం దురద రావడం, నల్లబడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా... రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుము, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. దోస లేదా కీరా రసంలో పచ్చి పాలు కలిపి చర్మానికి రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కమిలిన చర్మం వెంటనే సాధారణ రంగులోకి వస్తుంది. -
ముఖ కాంతికి...
బ్యూటిప్స్ ఉడికించిన ఓట్స్, తేనె బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. మాయిశ్చరైజింగ్‌గానే కాకుండా చర్మానికి మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. గుమ్మడికాయ, బొప్పాయి గుజ్జు సమపాళ్లలో తీసుకోవాలి. అందులో గుడ్డు సొనను కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది మలినాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సున్నితమైన చర్మ తత్త్వం గలవారు ప్యాచ్‌టెస్ట్ చేసుకోవడం మంచిది. రెండు బాదం పప్పులు నానిన తర్వాత కొద్దిగా నీళ్లు కలిపి వాటిని పేస్ట్ చేయాలి. అందులో పది చుక్కల నిమ్మరసం, అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. -
చిరుతిళ్లతో జర జాగ్రత్త!
సాక్షి, కడప : గడువు మీరిన చిరుతిళ్లు తిని చిన్నారులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటున్నారు వైద్యులు. కమలాపురం మండల పరిధిలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులను ఫుడ్ పాయిజన్ కబళించింది. గురువారం ఉదయం మహీధర్ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందితే, శుక్రవారం ఉదయం అతని సోదరి నవ్యశ్రీ మృత్యువాత పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు పిల్లల చిరుతిండ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల గడువు దాటినా లాభాపేక్షతో కక్కుర్తిపడి వ్యాపారులు అంటగడుతున్నారు. ఇంట్లో ఆహార విషయంలో కూడా తల్లిదండ్రులు చిన్నారులను కనిపెట్టి పరిశీలిస్తూ ఉండాలని పలువురు వైద్యులు చూచిస్తున్నారు. మధ్యాహ్న భోజన విషయంలో కూడా ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన విషయంలో అటు అధికారులు, ఇటు పాఠశాల ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇంటి వద్దనే ఆహారాన్ని వండి తీసుకు రావడం ఒక ఎత్తయితే, మరికొన్ని పాఠశాలల్లో వంటశాలలు లేక ఆరుబయట వంట చేస్తుండడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, కట్టెలతో వంట చేయడం వల్ల కొన్ని వ్యర్థ పదార్థాలు ఆహారంలో కలవడం, ఆకు కూరలు, కూరగాయలు తాజాగా లేకపోవడం తదితర సమస్యలపై అప్రమత్తత అవసరం. పులివెందులలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మితిమీరిన చిరుతిళ్లు వివిధ కంపెనీలకు చెందిన చిరుతిళ్లు కొద్ది రోజులుగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరైన న్యూట్రిషన్ నిపుణుల సలహాలు, సూచనలు లేకుండానే నాణ్యత లేని తినుబండారాలను ఆకర్షణీయంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువగా విక్రయించిన వ్యాపారులకు బహుమతులు ప్రకటిస్తూ అడ్డగోలు ఆర్జనకు బరితెగిస్తున్నారు. చాలా కంపెనీలకు చెందిన చిరుతిళ్లు తిని పలువురు చిన్నారులు నిత్యం ఎక్కడో ఒక చోట అస్వస్థతకు గురువుతున్నారు. ఇలా అస్వస్థతకు గురైన వెంటనే వాంతులు, విరేచనాలతో చిన్నారులు నీరసించి పోతున్నారు. ఆ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా విక్రయిస్తున్న చిరుతిండ్లపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆ బాధ్యత మరిచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ముచ్చటగా మూడు
అందం చిన్న వయసులోనే కొందరికి ముఖంపై చర్మం ముడతలు పడుతుంది. అవి పోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడి ఆకులను పొడి చేయాలి. ఇందులో మినప పొడి, ముల్తాన్ మిట్టీలను సమాన పాళ్లలో కలిపి, ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి. అది మాత్రమే కాదు. బంగాళదుంప గుజ్జు, టొమాటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముడతలు పోయేలా చేస్తాయి. క్యారెస్ రసంలో పాలు, బాదం పప్పు పేస్ట్ కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. బాదం నూనెతో మర్దనా చేసినా కూడా ముడతలు పోతాయి. ఆరోగ్యం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కాబట్టే కళ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ల సంరక్షణ విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక్కోసారి కళ్లలో చిన్న చిన్న కురుపులు వచ్చి విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాంటప్పుడు... జామ ఆకును వేడి చేసి, ఆ వేడి ఆకును ఓ గుడ్డలో చుట్టి, కురుపు ఉన్నచోట కాపడం పెట్టాలి. లేదంటే చెంచాడు ధనియాలను ఓ కప్పు నీటిలో వేసి మరిగించి, ఆ నీటిలో ముంచిన గుడ్డతో కాపడం పెట్టినా మంచిదే. ఖర్జూరపు గింజను పొడి చేసి, నీరు కలిపి పేస్టులా చేసి నొప్పి ఉన్న చోట రాసినా ఉపశమనం లభిస్తుంది. అలసట కారణంగా కళ్లు బరువుగా అనిపిస్తుంటే... ఓ గ్లాసు నీటిలో ఉసిరిక పొడి వేసి నానబెట్టి, ఆ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే హాయిగా ఉంటుంది. నిద్ర చాలకగానీ, ఏడవడం వల్ల కానీ కళ్లు ఉబ్బితే... గుడ్డులోని తెల్లసొనను కళ్లకింద రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే వాపు తగ్గుతుంది. అయితే సొన కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. కళ్లు అలసినట్లయితే... దోసకాయ రసంలో ముంచిన దూదిని కొంచెం సేపు కళ్లమీద పెడితే అలసట పోతుంది. ఆనందం అందుకే ఫ్రీ! సేల్స్‌మేన్: సార్... ఈ ఫ్యాన్ కొనండి. దీనితోపాటు కుర్చీ ఫ్రీగా వస్తుంది. కస్టమర్: విచిత్రంగా ఉందే... ఫ్యాన్ కొంటే కుర్చీ ఫ్రీగా ఇవ్వడమేంటి? సేల్స్‌మేన్: ఒకవేళ ఫ్యాన్ తిరక్కపోతే అది వేసుకుని ఎక్కి తిప్పుకోవచ్చని! ........................................................ రెండూ ఒకటే! తండ్రి: బబ్లూ... డెరైక్ట్ స్పీచ్కీ ఇన్‌డెరైక్ట్ స్పీచ్కీ తేడా ఏమిట్రా? బబ్లూ: మొన్న కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టావ్ చూడూ... అది డెరైక్ట్ స్పీచ్. నిన్న అమ్మమీద కోపం వచ్చినప్పుడు తననేమీ అనలేక నన్ను తిట్టావ్ కదా... అది ఇన్‌డెరైక్ట్ స్పీచ్. ......................................................................... అదుంటే చాలు! జిమ్‌లో చేరడానికి వెళ్లాడు సుందరం. ఇన్‌స్ట్రక్టర్‌ని ఇలా అడిగాడు ‘నేను సైట్ కొడుతున్న అమ్మాయి నన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి. నేను ఏ మెషీన్ ఉపయోగిస్తే మంచిది?’ దానికి ఇన్స్ట్రక్టర్ - ‘ఏటీఎం మెషీన్!’ అని జవాబిచ్చాడు.