బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చేమంతి రెక్కలు ఒక కప్పు, ఉడికించి చిదిమిన క్యారట్ ఒక కప్పు, వీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. అర కప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చేమంతి రెక్కలు వేసి మరిగించి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారట్‌లో వీట్‌జెర్మ్ ఆయిల్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి.
అవసరం అనుకుంటే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని, సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆక్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment