జుట్టురాలడం, చుండ్రు, పొడిబారడం వంటì సమస్యలకు హెర్బల్ షాంపూలు, నూనెలు వాడినప్పటికీ సరైన ఫలితం రాదు. ఇలాంటప్పుడు.. మానసిక ఒత్తిడి, విటమిన్ లోపాలు, మినరల్స్, ఐరన్ శరీరానికి తగినంత అందకపోవడం, కాలుష్యం, వంశపారంపర్యం, నిద్రలేమి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, అనారోగ్యం.. సమస్యలు కారణాలు అవుతున్నాయేమో గమనించాలి. అలాగే..
♦ నెలలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను జుట్టు కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఉసిరి, శికాకాయ, ఎండిన నిమ్మ ఆకులను కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.
♦కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండడం, రోజూ రెండు నానబెట్టిన బాదంపప్పులు తింటూ ఉంటే వెంట్రుకలు రాలడం, పొడిబారడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
♦ చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. వారానికి రెండు సార్లు పెరుగుతో మాడుకు మసాజ్ చేయాలి. అలాగే వెంట్రుకలంతా పట్టించాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. అలాగే షాంపూతో తలంటుకున్న తర్వాత, తడి జుట్టుకు తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించాలి. అయితే, కండిషనర్‌ని మాడుకు కాకుండా కేవలం వెంట్రుకలు మాత్రమే పట్టించాలి.
♦ పొల్యూషన్ కూడా వెంట్రుకులను నిస్తేజం చేస్తాయి. అందుకని బయటకు వెళ్లినప్పుడు తలకు క్యాప్‌తో కవర్ చేయాలి. అలాగే తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, బాదంపప్పు, పాల ఉత్పత్తులు, తాజా కాయగూరలను చేర్చండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది.
హోమ్ ప్యాక్స్
Published Fri, Jun 15 2018 1:19 AM | Last Updated on Fri, Jun 15 2018 2:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment