
టమాటాను మెత్తగా చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం సహజరంగుకు వస్తుంది. చర్మం బిగుతుగా మారి, ముడతలూ తగ్గుతాయి.
రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడిని నీళ్లలో వేసి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటితో జుట్టును తడిపి, ఆరనివ్వాలి. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు నిగనిగలాడుతుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment