అమ్మలా ఆమ్లా
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్‌గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.
ఆమ్లా జ్యూస్
కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్
తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి
అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి
మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్‌కి దివ్యమైన ఔషథం.
ఆమ్లా కాండీ
కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్‌లు.
తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి.
హనీ ఆమ్లా డ్రింక్
ఒక గ్లాసు డ్రింక్‌కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.
తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది.
గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment