tomoto
-
చర్మంపై మృత కణాలు పోవాలంటే.. ఇలా చేయండి!
టొమాటో రసం పావు కప్పు తీసుకుని అందులో దూది ముంచి ముఖానికి అద్దాలి. ఆరిన తర్వాత వలయాకారంగా మర్దన చేస్తూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా కాంతివంతంగా మారుతుంది. వార్ధక్య లక్షణాలుగా కనిపించే ముడతలు కూడా తొలగిపోతాయి.మృత కణాలు పోవాలంటే...బొప్పాయి గుజ్జు పావు కప్పు తీసుకుని అందులో టీ స్పూన్ పన్నీరు (రోజ్‌వాటర్) కలిపి ముఖానికి రాయాలి. పది లేదా పదిహేను నిమిషాలకు తేమను చర్మం పీల్చుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా ముఖమంతా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.ఇవి చదవండి: హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..? -
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం
కడప అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్న టమాటను ప్రభుత్వం ధర తగ్గించి రైత బజారు ద్వారా తక్కువ ధరలకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం కడప రైతు బజారులో ఈ కార్యక్రమాన్ని మార్కెటింగ్‌శాఖ ఏడీ హిమశైల ప్రారంభించారు. కర్నాటక ప్రాంతంలోని కోలార్ నుంచి 4950 కిలోల టమాటాలను కడప మార్కెటింగ్ శాఖ రైతు బజారుకు తెప్పించింది. ఇందులో 750 కిలోలను ఎర్రగుంట్ల రైతు బజారుకు పంపించారు. ఈ సందర్భంగా మార్కె టింగ్‌శాఖ ఏడీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర 100 నుంచి 120 రూపాయల వరకు ఉందని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే టమా టాలను అందించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రా ల నుంచి తెప్పించి రూ. 65 తో అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
సెంచరీ కాదు డబుల్ సెంచరీ కూడా దాటేసిన టమాట, ఉల్లి ధరలు..! కారణం అదేనటా..!
కేంద్ర బడ్జెట్ 2022-23 సమావేశాలు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో లాంఛనంగా ప్రారంభమైనా విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించిన కీలక వివరాలను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ సర్వేను రూపొందించింది. అయితే గత ఏడాదిలో ప్రాంతాలను బట్టి దేశవ్యాప్తంగా టమాట, ఉల్లిగడ్డ ధరలు ఎందుకు పెరిగాయనే విషయాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. కారణాలు అవే..! గత ఆర్థిక సంవత్సరంలో హోల్‌సేల్ ప్రైజ్ సేల్ ఇండెక్స్ పైపైకి ఎగబాకింది. ప్రతి నెలలో డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఎగబాకుతూ వచ్చింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా టమాట, ఉల్లి ధరలు గత ఏడాది నవంబర్ వరకు సెంచరీ దాటేసి డబుల్ సెంచరీకు చేరువయ్యాయి. 2021లో టమాట, ఉల్లి ధరలు అధిక అస్థిరతకు గురైనాయి. అకాల వర్షాలు..! ఆయా రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సర్వే ప్రకారం పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా సరఫరాకు అంతరాయం కలగడంతో టమాటా ధరలపై ఒత్తిడి మరింత పెరిగింది. నవంబర్ 2021లో టమాట ధరలు కిలో రూ.100కి చేరాయి. మరోవైపు సరఫరా అడ్డంకులు కూడా ధరల పెరుగుదలకు కారణాలయ్యాయి. ఉల్లి ధరలు అస్థిరంగానే..! గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు కూడా అస్థిరంగానే ఉన్నాయి. ఉల్లి ధరలపై ఆర్ధిక సర్వేలో... సీజనల్ కాంపోనెంట్ రబీ పంట కాలంతో సమానంగా ఉల్లి ధరల్లో ఒత్తిడి కన్పించింది. డిసెంబర్లో ఉల్లి ధరలు గరిష్ట స్థాయికు చేరకున్నట్లు పేర్కొంది. ఆర్థికసర్వే సూచనలు ఇవే..! సామాన్యులకు ఉపశమనం కల్పించేలా...టమాట, ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆర్థిక సర్వే 2021-22 పలు సూచనలను చేసింది. సీజనల్, అకాల వర్షాలు రెండూ టమాట, ఉల్లిపాయల ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయి. కాలానుగుణ ఉత్పత్తి విధానాల ఫలితంగా ధరలలో కాలానుగుణతకు విధానపరమైన శ్రద్ధ అవసరమని తెలిపింది. టమోటా మిగులు ఉత్పత్తి ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు, ఉల్లి ప్రాసెసింగ్, నిల్వ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించాలి. ఉత్పత్తి వృధాను తగ్గించడం, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణ కూడా డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుందని ఆర్థిక సర్వే సూచించింది. చదవండి: Economic Survey: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే? -
తగ్గేదేలే అంటున్న టమాటా.. కిలో ఎంతంటే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు తగ్గనంటున్నాయి. గత నెల నుంచి ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా సరఫరా కావడంలేదు. ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క వ్యవసాయ మార్కెట్లలో ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క కొందరు రిటైల్ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగరానికి రోజుకు దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు సరఫరా అవుతోంది మాత్రం 40 నుంచి 50 లారీలే. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో పొరుగు రాష్ట్రాలపైనే వ్యాపారులు ఆధారపడాల్సివస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని రోజులుగా నగరానికి టమాటా తరలిస్తున్నారు. అయినా.. నగర అవసరాలను తీర్చలేకపోతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 10 నుంచి 15 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 35 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. కానీ నగర అవసరాలకు దాదాపు 75 లారీల నుంచి 120 లారీల వరకు డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. రిటైల్ వ్యాపారులు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. -
ఆ మార్కెట్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టమాటా.. ఏకంగా..!
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా అత్యధిక ధర పలికింది. సోమవారం మార్కెట్లో మొదటిరకం టమాటా ధర కిలో రూ.104 వరకు పలికింది. వారం రోజులుగా మదనపల్లె డివిజన్ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం, వర్షం దెబ్బకు పంట నాణ్యత కోల్పోవడం, డ్యామేజీ అధికంగా ఉండడం వంటి కారణాలతో సరుకు లభ్యత కష్టమవుతోంది. మదనపల్లె, తంబళ్లపల్లె, కర్ణాటకలోని శ్రీనివాసపురం, రాయల్పాడు తదితర ప్రాంతాల నుంచి రైతులు సోమవారం మార్కెట్‌కు 260 మెట్రిక్ టన్నుల టమాటాను తీసుకువచ్చారు. వాటిలో మొదటిరకం టమాటా కిలో రూ.60–104 వరకు ధర పలికింది. రెండోరకం టమాటా ధరలు కిలో రూ.18–58 మధ్య నమోదయ్యాయి. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, తుపానులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటా పంట బాగా దెబ్బతింది. ప్రజావసరాలకు సరిపడా టమాటా మార్కెట్లో దొరకడం లేదు. దీంతో ఉన్నపళంగా సరుకుకు డిమాండ్ ఏర్పడి మంచి ధరలు పలుకుతున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెపుతున్నారు. -
టమాటా ఎవరికి జాక్ పాట్?
-
బ్యూటిప్స్
టమాటాను మెత్తగా చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం సహజరంగుకు వస్తుంది. చర్మం బిగుతుగా మారి, ముడతలూ తగ్గుతాయి. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడిని నీళ్లలో వేసి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటితో జుట్టును తడిపి, ఆరనివ్వాలి. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు నిగనిగలాడుతుంటుంది. -
డీలాపడ్డ టమాటా!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో టమాటా ధర రోజురోజుకూ పడిపోతోంది. ఒకటి రెండు నెలల కింద కిలో రూ. 100కు చేరి భయపెట్టిన టమాటా.. ఇప్పుడు ఐదు రూపాయలకు తగ్గి నేల చూపులు చూస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరకే అందుతున్నా.. రైతులకు మాత్రం కిలోకు రూపాయి, రెండు రూపాయలు మాత్రమే దక్కుతోంది. ముందు ముందు టమాటా ధర ఇంకా పడిపోతుందనే అంచనాతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు లేకపోవడం, టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలేవీ లేకపోవడం వల్లే రాష్ట్రంలో టమాటా ధరలు విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని అంటున్నారు. దళారులకే గిట్టుబాటు!: రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో టమాటా విస్తారంగా సాగవుతుంది. ఇతర ప్రాంతాల్లోనూ కొద్ది మొత్తంలో సాగు చేస్తారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతుంది. సాధారణంగా చలికాలంలో టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా సీజన్‌గా చెబుతారు. చలి పెరిగితే టమాటా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ కాలంలో టమాటా ధర పడిపోతుంది. టమాటా ధరలు ఏడాదిలో బాగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. కానీ సరఫరా ఎక్కువున్నా, తక్కువున్నా బాగుపడేది మాత్రం దళారులే. డిమాండ్ అధికంగా ఉండి ధర పెరిగితే.. ఆ మేరకు సొమ్ము రైతులకు చేరడం లేదు. గిట్టుబాటు ధరే లభిస్తుంది. అదే సీజన్లో టమాటా ధర తగ్గినప్పుడు రైతులకు ఏమీ మిగలడం లేదు. రైతులకు నామమాత్రంగా కిలోకు రూపాయో, అర్ధరూపాయో ఇస్తున్న దళారులు.. మార్కెట్లో మాత్రం నాలుగైదు రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నట్లు మార్కెటింగ్ వర్గాలే చెబుతున్నాయి. ఏటా లక్ష టన్నులు వృథా.. రాష్ట్రంలో టమాటా, వంకాయ, బెండ, బీర, కాకర తదితర కూరగాయలు 8.68 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మొత్తంగా ఏటా 50.01 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతుండగా.. తగిన నిల్వ వసతి లేక ఏటా 16.50 లక్షల టన్నులు కుళ్లిపోతున్నట్లు అంచనా. ఇలా కుళ్లిపోతున్న పంటలో దాదాపు లక్ష టన్నుల మేర టమాటాయే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యా లను పండించాక వాటిని సరైన చోట, తగిన విధంగా నిల్వ ఉంచాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర రానప్పుడు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి.. డిమాండ్ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. కానీ రాష్ట్రంలో సరిపడా శీతల గిడ్డంగులు అందుబాటులో లేవు. ఉద్యాన పంటల దిగుబడుల మేరకు రాష్ట్రంలో 216 శీతల గిడ్డంగులు అవసరంకాగా.. ఉన్నవి 56 మాత్రమే. టమాటా పూర్తిగా పండని స్థితిలో ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజీలో పెడితే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పండినదైతే 20 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. కానీ శీతల గిడ్డంగులు సరిపడా లేక టమాటాలు కుళ్లిపోతున్నాయి. వినియోగం పెంచాలి.. ‘‘ఏయే సీజన్లో ఏ కూరగాయలు బాగా పండితే వాటి వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలి. టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగం పెంచాలి. కూరల్లో చింతపండుకు బదులు టమాటాను పులుపుగా వాడుకోవచ్చు. చలికాలంలో టమాటా సూప్ తయారు చేసుకోవచ్చు. అందరూ టమాటా కొనాలి.. తినాలి.. తాగాలి..’’ – ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం టమాటా ధరలు స్థిరీకరించేందుకు నిల్వ వసతులను పెంచడంతోపాటు టమాటా ఉప ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పడం కూడా అవసరం. టమాటాతో జామ్ తయారు చేయవచ్చు, ఎండబెట్టి పొడిగా చేసి విక్రయించొచ్చు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఆ రకమైన ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పాలి. వాటిని మహిళా సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తే వారికీ ఉపాధి దొరుకుతుంది. రైతులకు గిట్టుబాటు అవుతుంది. ♦ హాస్టళ్లలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం టమాటా సూప్ తయారు చేసి ఇవ్వొచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ♦ చలికాలంలో సూప్‌లు అందుబాటులోకి వస్తే టీ లాగా వినియోగదారులు సూప్‌లను తాగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల టమాటా పొడి, సూప్‌ల తయారీకి సంబంధించి చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, శిక్షణను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు అందజేయాలి. ♦ టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉప ఉత్పత్తులు తయారు చేయించాలి. -
ఆపిల్‌తో టమోటాలకు పోటీ ఎందుకు?
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తలకిందులవడంతో రైతులంతా తల్లడిల్లిపోతున్నారు. గత జూన్ నెలలో ఆరు రూపాయలకు కిలో ధర పలికిన టమోటా ఇప్పుడు యాభై రూపాయలకు కిలో పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వంద రూపాయల వరకు దూసుకెళ్లిన టమోటా ధర ఇప్పుడు 75, 80 రూపాయల వద్ద ఊగిసలాడుతోంది. టమోటాలకు ఆపిల్ డిమాండ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చెక్కర్లు కొడుతున్నాయి. టమోటా ధరను చూసి రైతులకు గిట్టుబాటు ధర దొరకుతుందంటూ సంబరపడితే పొరపాటే. డిమాండ్‌కు తగ్గ సరకు అందుబాటులో లేకపోవడం వల్ల టమోటాల ధరను అమాంతంగా పెంచి సొమ్ము చేసుకొంటోంది వ్యాపారస్థులే. మరోపక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండు మిర్చికి గిట్టుబాటు ధర లభించక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంజాబ్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు బంగాళా దుంపలను రోడ్డున పారబోస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రైతులు కూడా బంగళా దుంపలను మురికి కాల్వల్లో పడేస్తున్నారు. రాజస్థాన్‌లో వెల్లుల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు గోల పెడుతున్నారు. ఉల్లి ధరలు పడిపోవడంతో మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా టమోటా ధర క్వింటాల్‌కు 600 రూపాయలు ఉండగా, నేడు క్వింటాల్‌కు 4,100 రూపాయలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లో బంగళా దుంపలు గతేడాది క్వింటాల్‌కు 800 రూపాయల నుంచి 1400 రూపాయలు పలుకగా, నేడు 300 రూపాయల నుంచి 500 రూపాయలు పలుకుతోంది. రాజస్థాన్‌లో రెండేళ్ల క్రితం వెల్లుల్లి ధర క్వింటాల్‌కు 8000 రూపాయలుండగా, నేడు 3,200 రూపాయలకు పడిపోయింది. కూరగాయల ధరలు ఇంత దారుణంగా తలకిందులవడానికి కారణాలేమిటీ? ప్రప్రథమ కారణం పెద్ద నోట్ల రద్దు. నగదు లావాదేవీలకు రైతులకు అవకాశం లేకపోవడం వల్ల వారు సరకును సకాలంలో అమ్ముకోలేకపోయారు. గిడ్డంగుల్లో దాచుకోవాల్సి వచ్చింది. తర్వాత అధిక దిగుబడి రావడంతో డిమాండ్ పడిపోయింది. ఆ తర్వాత గిట్టుబాటు ధరల కోసం 16 రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలను నిర్వహించడం, వారు టమోటా పంటలను గాలికొదిలేయడం, హిమాచల్ లాంటి రాష్ట్రాల్లో టమోటాలను గిట్టుబాటులేక రైతులు రోడ్డపై పారబోయడం, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అధిక వర్షాలకు టమోటా పంట దెబ్బతినడం తదితర కారణాల వల్ల టమోటాల ధరలు పెరిగాయి. రైతుల సమ్మెకాలంలో నిల్వ ఉంచిన బంగాళా దుంపలకు అధిక దిగుబడి వచ్చి చేరడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. వెల్లుల్లి పరిస్థితి దాదాపు అదే. ఈ కారణాలకు తోడు పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో మహారాష్ట్రలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. ధరలు పెరిగినా, తగ్గినా ఇక్కడ నష్టపోతున్నది ప్రధానంగా రైతులు, ఆ తర్వాత కొనుగోలుదారులైన ప్రజలు. కూరగాయలు, నిత్యావసర సరకుల ధరల స్థిరీకరణకు ప్రభుత్వ మార్కెటింగ్ శాఖలు జోక్యం చేసుకొని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమంటూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులెత్తేసింది. ఇక రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రమే సకాలంలో స్పందించి ఎనిమిది లక్షల టన్నుల బంగాళా దుంపలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. అంతమొత్తాన్ని భద్రపరిచే అవకాశాలు లేకపోవడం వల్ల అవి అప్పుడే కుళ్లిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఆయా రాష్ట్రాల వ్యాపారులు డిమాండ్ పడిపోతుందని అంగీకరించడం లేదు. దీంతో కొన్ని జీల్లాలో మార్కెటింగ్ అధికారులు టన్నులకొద్ది బంగాళా దుంపలను భూమిలో పాతిపెడుతుండగా, కొన్ని జిల్లాలో అధికారులు రోడ్డురోలర్లతో వాటిని తొక్కిస్తున్నారు. మూడొంతల మంది అన్నమో రామచంద్రా! అంటూ అలమటిస్తున్న భారతావనిలో ఆహారం ఇలా నేలపాలవుతోంది.