
టొమాటో రసం పావు కప్పు తీసుకుని అందులో దూది ముంచి ముఖానికి అద్దాలి. ఆరిన తర్వాత వలయాకారంగా మర్దన చేస్తూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా కాంతివంతంగా మారుతుంది. వార్ధక్య లక్షణాలుగా కనిపించే ముడతలు కూడా తొలగిపోతాయి.
మృత కణాలు పోవాలంటే...
బొప్పాయి గుజ్జు పావు కప్పు తీసుకుని అందులో టీ స్పూన్ పన్నీరు (రోజ్‌వాటర్) కలిపి ముఖానికి రాయాలి. పది లేదా పదిహేను నిమిషాలకు తేమను చర్మం పీల్చుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా ముఖమంతా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్‌లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
ఇవి చదవండి: హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment