
మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే ఇలా చేయండి..!
మూడు నిమ్మకాయలు, టేబుల్ స్పూన్ చక్కెర, టీ స్పూన్ బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి.
నిమ్మకాయలను ముక్కలు చేయాలి.
పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి.
అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.
దీనిని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చేత్తో ఐదు నుంచి పది నిమషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.
ఇది అన్ని కాలాల్లోనూ అవసరమే.
వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్‌లు సోకకుండా ఉండడానికి ఈ స్క్రబ్‌లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.
ఇవి చదవండి: సాగుకు భరోసా..!
Comments
Please login to add a commentAdd a comment