Foot trip
-
Beauty Tips: పాదాల రక్షణకై.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే ఇలా చేయండి..!మూడు నిమ్మకాయలు, టేబుల్ స్పూన్ చక్కెర, టీ స్పూన్ బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి.నిమ్మకాయలను ముక్కలు చేయాలి.పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.దీనిని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చేత్తో ఐదు నుంచి పది నిమషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.ఇది అన్ని కాలాల్లోనూ అవసరమే.వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడానికి ఈ స్క్రబ్‌లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.ఇవి చదవండి: సాగుకు భరోసా..! -
పాదయాత్రను అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు
ఒంగోలు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రను అధికారపార్టీ అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. జగన్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి టీడీపీలో భయం మొదలైందని, అందుకే యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కడైనా తిరగవచ్చని అన్నారు. గత మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. చివరికి అర్హులైన ఎంతోమంది వృద్ధుల పింఛన్లు సైతం తొలగించిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సైతం వారి సమస్యలను ఆయనకు తెలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర జరుగుతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత అన్ని వర్గాల ప్రజలతో నేరుగా మమేకమవుతారని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామని వైవీ చెప్పారు. -
వైఎస్ జగన్ పాదయాత్రను ఆహ్వానిస్తున్నాం
ఒంగోలు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రను తాము ఆహ్వానిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజోపయోగమైన పాదయాత్రలు ఎవరు చేసినా తమ పార్టీ ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా వైఎస్ జగన్ చేయనున్న పాదయాత్రను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి వారి పార్టీకి చెందిన నాయకులే విమర్శిస్తుంటే సీఎం నోరెత్తకపోవడమేంటని ప్రశ్నించారు. తన సహచర మంత్రులపై వస్తున్న విమర్శల పట్ల సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. -
తుమ్మలగుంట నుంచి తిరుత్తణికి పాదయాత్ర
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడులోని తిరుత్తణికి పాదయాత్ర చేపట్టారు. సోమవారం తుమ్మలగుంటలో ఈ పాదయాత్రను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. వంద కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్ర పల్లెల మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేతో పాటు పాదయాత్రలో నడిచారు. తిరుచానూరు జనసంద్రమైంది. సాయంత్రానికి పుత్తూరుకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 7 గంటలకు బయల్దేరి 16 గంటలపాటు సుమారు 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి సాయంత్రానికి తిరుత్తణికి చేరుకుంటారు. దేశ చరిత్రలో ఏ ప్రతిపక్షనేత కూడా మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాఖలాలు లేవని, జగన్ చేసే ప్రజాసంకల్ప మహా పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. జగన్‌కు మద్దతుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకే వైఎస్ జగన్ పాదయాత్రను చేపడుతున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తపించే నేత జగన్ అని ఎమ్మెల్యే నారాయణస్వామి కొనియాడారు. -
ప్రజా ప్రస్థానం 12వ వార్షికోత్సవం నేడు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి గురువారం నాటికి సరిగ్గా పన్నెండేళ్లు. కరవు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ,నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర లక్ష్యాలను స్మరించుకోవడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం 12 వ వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారు.