
ఒంగోలు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రను తాము ఆహ్వానిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజోపయోగమైన పాదయాత్రలు ఎవరు చేసినా తమ పార్టీ ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా వైఎస్ జగన్ చేయనున్న పాదయాత్రను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి వారి పార్టీకి చెందిన నాయకులే విమర్శిస్తుంటే సీఎం నోరెత్తకపోవడమేంటని ప్రశ్నించారు. తన సహచర మంత్రులపై వస్తున్న విమర్శల పట్ల సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment