కేంద్ర బడ్జెట్ 2022-23 సమావేశాలు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో లాంఛనంగా ప్రారంభమైనా విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించిన కీలక వివరాలను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ సర్వేను రూపొందించింది. అయితే గత ఏడాదిలో ప్రాంతాలను బట్టి దేశవ్యాప్తంగా టమాట, ఉల్లిగడ్డ ధరలు ఎందుకు పెరిగాయనే విషయాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు.
కారణాలు అవే..!
గత ఆర్థిక సంవత్సరంలో హోల్‌సేల్ ప్రైజ్ సేల్ ఇండెక్స్ పైపైకి ఎగబాకింది. ప్రతి నెలలో డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఎగబాకుతూ వచ్చింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటుగా టమాట, ఉల్లి ధరలు గత ఏడాది నవంబర్ వరకు సెంచరీ దాటేసి డబుల్ సెంచరీకు చేరువయ్యాయి. 2021లో టమాట, ఉల్లి ధరలు అధిక అస్థిరతకు గురైనాయి.
అకాల వర్షాలు..!
ఆయా రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో టమాటా, ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సర్వే ప్రకారం పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా సరఫరాకు అంతరాయం కలగడంతో టమాటా ధరలపై ఒత్తిడి మరింత పెరిగింది. నవంబర్ 2021లో టమాట ధరలు కిలో రూ.100కి చేరాయి. మరోవైపు సరఫరా అడ్డంకులు కూడా ధరల పెరుగుదలకు కారణాలయ్యాయి.
ఉల్లి ధరలు అస్థిరంగానే..!
గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు కూడా అస్థిరంగానే ఉన్నాయి. ఉల్లి ధరలపై ఆర్ధిక సర్వేలో... సీజనల్ కాంపోనెంట్ రబీ పంట కాలంతో సమానంగా ఉల్లి ధరల్లో ఒత్తిడి కన్పించింది. డిసెంబర్‌లో ఉల్లి ధరలు గరిష్ట స్థాయికు చేరకున్నట్లు పేర్కొంది.
ఆర్థికసర్వే సూచనలు ఇవే..!
సామాన్యులకు ఉపశమనం కల్పించేలా...టమాట, ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆర్థిక సర్వే 2021-22 పలు సూచనలను చేసింది. సీజనల్, అకాల వర్షాలు రెండూ టమాట, ఉల్లిపాయల ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయి. కాలానుగుణ ఉత్పత్తి విధానాల ఫలితంగా ధరలలో కాలానుగుణతకు విధానపరమైన శ్రద్ధ అవసరమని తెలిపింది. టమోటా మిగులు ఉత్పత్తి ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు, ఉల్లి ప్రాసెసింగ్, నిల్వ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించాలి. ఉత్పత్తి వృధాను తగ్గించడం, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణ కూడా డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుందని ఆర్థిక సర్వే సూచించింది.
చదవండి: Economic Survey: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment