కడప అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్‌లో అధిక ధర పలుకుతున్న టమాటను ప్రభుత్వం ధర తగ్గించి రైత బజారు ద్వారా తక్కువ ధరలకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం కడప రైతు బజారులో ఈ కార్యక్రమాన్ని మార్కెటింగ్‌శాఖ ఏడీ హిమశైల ప్రారంభించారు.
కర్నాటక ప్రాంతంలోని కోలార్ నుంచి 4950 కిలోల టమాటాలను కడప మార్కెటింగ్ శాఖ రైతు బజారుకు తెప్పించింది. ఇందులో 750 కిలోలను ఎర్రగుంట్ల రైతు బజారుకు పంపించారు. ఈ సందర్భంగా మార్కె టింగ్‌శాఖ ఏడీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర 100 నుంచి 120 రూపాయల వరకు ఉందని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే టమా టాలను అందించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రా ల నుంచి తెప్పించి రూ. 65 తో అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment