RYTHU BAZAR
-
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
సాక్షి టాస్క్‌పోర్స్: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స్టాల్ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్డీవో, డీఎస్వోలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతు బజార్లో స్టాల్‌ను ఓపెనింగ్ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. ఆ వెంటనే రైతు బజార్ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపెనింగ్ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు. -
టమాటా ధరల భారం నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
ట‘మోత’
సనత్‌నగర్: టమాటా ఠారెత్తిస్తోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. రైతుబజార్లో కిలో రూ.75 ఉండగా బహిరంగ మార్కెట్లో సెంచరీ దాటేసింది. టమాటా పంట దిగుబడి భారీగా తగ్గడంతో రోజువారీగా హోల్‌సేల్ మార్కెట్‌కు రావాల్సిన దాని కంటే తగ్గిపోవడంతో ధరలు ఎగబాకుతున్నాయి. ఎర్రగడ్డ రైతుబజార్‌కు రోజువారీగా 200 క్వింటాళ్ల టమాటా వస్తోంది. నాలుగైదు రోజులుగా కేవలం 50–60 క్వింటాళ్లకు పడిపోయింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మదనపల్లె, బెంగళూరు నుంచి ఎక్కువగా టమాటా నగరానికి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం టమాటా పంట కోతలు పూర్తయ్యి కొత్త పంట వేశారు. పంట కోతకు రావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు టమాటా ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18న రైతుబజార్లో రూ.39 ఉన్న కిలో టమాటా ధర వారం రోజుల వ్యవధిలోనే రూ.75కు చేరడం గమనార్హం. -
రైతు బజార్ ధరలు
పెందుర్తి: స్థానిక రైతు బజార్లో సోమవారం నాటికి కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. బోర్డులో పెట్టిన ధర కంటే ఎక్కువకు విక్రయాలు జరిపితే వినియోగదారులు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రకం(కిలో), ధర(రూపాయిల్లో) ఉల్లిపాయలు(పాతవి)మధ్యప్రదేశ్ 20, ఉల్లిపాయలు రైతువారి జంట పాయలు 20, టమాటా దేశవాలి/హైబ్రిడ్ 30, వంకాయలు(తెల్లవి) 28, వంకాయలు(నలుపు) 30, వంకాయలు(పొడవు) 30, వంకాయలు(కలకత్తా)/డిస్కో 26, వంకాయలు(వెల్లంకి),కాశీపట్నం 40, బెండకాయలు 36, పచ్చిమిర్చి(నలుపుసన్నాలు)శ్రీకాకుళం మిర్చి 48/ 40, బజ్జి మిర్చి/పకోడ మిర్చి 50/64, కాకరకాయలు 32, బీరకాయలు 32, ఆనపకాయలు 16, కాలీఫ్లవర్/బ్రకోలి 30/60, క్యాబేజీ(గ్రేడింగ్)/ఊదా రెడ్ క్యాబేజీ 30/32, క్యారెట్(డబల్ వాషింగ్)/వాషింగ్/మట్టి 48/36, దొండకాయలు 20, బంగాళదుంపలు పాతవి/కొత్తవి అరకు 23/25, అరటి కాయలు పెద్ద/చిన్న(ఒకటి) 7/4, మునగకాడలు(కిలో) 44, అల్లం 48, బరబాటి 46, ముల్లంగి 24, నిమ్మకాయలు 50, గోరు చిక్కుడు 36, దోసకాయలు 20, బీట్రూట్ 34, వెల్లుల్లిపాయలు(బాంబ్)/మీడియం 48/30, కొబ్బరికాయ(పెద్దది) 18, బీన్స్ పెన్సిల్/రౌండ్/పిక్కలు 84/60/70, ఆగాకర దేశవాలి/హైబ్రిడ్ 76/50, పొటల్స్ 24, కీరదోస 22, క్యాప్సికం 52, పొట్లకాయ పెద్దవి/చిన్నవి/కిలో 16/12/24, చామదుంపలు మట్టివి/కడిగినవి 38/32, చిలగడ దుంపలు 34, కంద దుంప 34, దేముడు చిక్కుడు 62, బద్ద చిక్కుడు 62, చౌచో(బెంగళూరు వంకాయలు) 20, ఉసిరికాయలు 54, కరివేపాకు 40, కొత్తిమీర 130, పుదీన(కట్ట) 5, చుక్కకూర(కట్ట) 3, పాలకూర(కట్ట) 5, మెంతికూర(కట్ట) 3, తోటకూర(కట్ట) 3, బచ్చలికూర(కట్ట) 3, గోంగూర(కట్ట) 3, తమలపాకులు(100 ఆకులు) 50, నూల్‌కోల్/రాజ్మా పిక్కలు 24/120, మామిడి కాయలు కలెక్టర్/పరియాలు/ కొలనుగోవ/ బారమస 26/ 28/46, స్వీట్ కార్న్/ మొక్కజొన్న 28/ 60/ 80, బూడిద గుమ్మడి/తీపి గుమ్మడి 22/18, కూర పెండలం 18, మామిడి పళ్లు బంగినపల్లి/రసాలు/సువర్ణరేఖ/పరియాలు/పనుకులు/కొత్తపల్లి కొబ్బరి మామిడి రూ.70/70/70/50/130, వేరుశనగ 50, పువ్వులు: చామంతి హైబ్రిడ్/దేశవాలి 400, గులాబీ 300, గులాబీ డజను 20, బంతి దండ పసుపు/ఆరెంజ్/మిక్సిడ్ 25/30, మల్లెపూలు మూర/కిలో 30/500, కనకాంబరాలు మూర/కిలో 35/1600, విరాజాజి మూర/కిలో 25/200, కాగడ మల్లె మూర/లిల్లీ కిలో 30/200, తులసి మాల మూర/నందివర్థనాలు (50పువ్వులు) 20/10, బంతి పువ్వులు కిలో 120, మందార మొగ్గలు (20) 10, పండ్లు: పైనాపిల్ కిలో/చిన్నది/పెద్దది 40/25/30, దానిమ్మ 190, నేరేడు 150, బొప్పాయి 24, ఆపిల్ (మొదటి, రెండో రకం)/రాయల్ ఆపిల్ 150/100/ 190, అరటి పండ్లు(కిలో) 40, కమలాలు క్వీన్/నాగపూర్ 100/80, సపోట 50, జామకాయలు తైవాన్/దేశీ 50/45, ద్రాక్ష సీడ్/సీడ్లెస్90/145, ద్రాక్ష తెలుపు/నలుపు(కిస్మిస్) 80/150, కివి 180, బత్తాయి 60, ఉల్లికాడలు/మోసులు 60, పుచ్చకాయలు దేశి/కిరణ్/పసుపు/కర్బుజా 15/16/24/28, పనసతొనలు కిలో 90, చింతపండు పిక్క తీసింది/పిక్కతో 380/120 , చింతచిగురు/కాయలు 65/40, గుడ్డు(ఒకటి) 5.40. -
రైతు బజార్లో తక్కువ ధరకు వంట నూనెల విక్రయాలు
కడప అగ్రికల్చర్: రాష్ట్రవ్యాప్తంగా వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సామాన్యుడు కనీవిని ఎరుగని రీతిలో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు కొని తినలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు వినియోగదారులకు బ్రాండెడ్ ఆయిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విజయ్ బ్రాండ్‌కు చెందిన సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, పామాయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్‌ను విక్రయించేందుకు సిద్ధం చేసి ధరలను కూడా ఖరారు చేశారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతు బజార్లో ఉన్న అన్ని కిరాణా షాపుల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. రైతు బజార్‌కు సంబంధించిన కొంతమంది సిబ్బంది ద్వారా కూడా వీటిని విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టమాటాలను.. ఇటీవల బహిరంగ మార్కెట్లో కిలో టమాటాల ధర రూ. 100 నుంచి 120 దాకా పలికింది. ఈ తరుణంలో ప్రజల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కర్నాటక నుంచి దిగుమతి చేసుకుని రైతు బజార్ ద్వారా కిలో రూ. 65తో విక్రయించింది. ప్రస్తుతం రూ.52తో విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలకు విజయ్ బ్రాండ్ ఆయిల్ బహిరంగ మార్కెట్లో ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. దీంతో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజారులో విజయ్ బ్రాండ్‌కు సంబంధించిన ఆయిల్ ఉత్పత్తులను తీసుకొస్తోంది. ధరలు కూడా బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ఉండనున్నాయి. ఈ నూనెలు రెండు మూడు రోజుల్లో రైతుబజార్‌కు వస్తాయి. – హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ, కడప -
రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం
కడప అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్న టమాటను ప్రభుత్వం ధర తగ్గించి రైత బజారు ద్వారా తక్కువ ధరలకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం కడప రైతు బజారులో ఈ కార్యక్రమాన్ని మార్కెటింగ్‌శాఖ ఏడీ హిమశైల ప్రారంభించారు. కర్నాటక ప్రాంతంలోని కోలార్ నుంచి 4950 కిలోల టమాటాలను కడప మార్కెటింగ్ శాఖ రైతు బజారుకు తెప్పించింది. ఇందులో 750 కిలోలను ఎర్రగుంట్ల రైతు బజారుకు పంపించారు. ఈ సందర్భంగా మార్కె టింగ్‌శాఖ ఏడీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర 100 నుంచి 120 రూపాయల వరకు ఉందని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే టమా టాలను అందించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రా ల నుంచి తెప్పించి రూ. 65 తో అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
భారమైనా.. ఉల్లి అందుబాటులోకి..
సాక్షి, అమరావతి: ఆర్థిక భారం పడుతున్నా ఒకవైపున నాఫెడ్, మరోవైపు ప్రైవేట్ మార్కెట్లలో ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లకు రవాణా చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఉల్లిపాయలకు డిమాండ్ పెరగడంతో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్)పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి పెంచాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలైతే ఎన్నికల తేదీలోపు వినియోగదారులకు ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకురాకపోతే ఫలితాలపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలకు ఉల్లి రవాణా ఆలస్యమవుతోంది. ఇది గమనించిన ఏపీ మార్కెటింగ్ శాఖ పది మంది సిబ్బందిని మహారాష్ట్రలోని నాసిక్‌కు పంపింది. వీరిలో కొందరు నాఫెడ్‌కు గతంలో ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఉల్లిపాయలను రాష్ట్రానికి రవాణా చేయడానికి, మరికొందరు నాసిక్ పరిసర గ్రామాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఉల్లి కొరతను ముందుగానే ఊహించి.. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఉల్లి కొరతను ముందుగానే ఊహించి సెప్టెంబర్‌లోనే 6 వేల టన్నులను నాఫెడ్‌కు ఇండెంట్ పెట్టింది. నాఫెడ్ నుంచి కిలో రూ.35లకు ఉల్లి లభిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి రాష్ట్రానికి రవాణా, సరుకు గ్రేడింగ్ చేయడానికి ప్రభుత్వంపై మరో రూ.15 వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటివరకు ప్రధాన రైతుబజార్లలోనే రాయితీపై ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన రైతుబజార్లలోనూ అమ్మకాలు ప్రారంభిస్తామని రైతుబజార్ రాష్ట్ర డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. -
రైట్ రైట్.. రైతు బజార్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి ‘వైఎస్సార్ జనతా బజార్లు’గా నామకరణంచేయనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్టీసీలో ఇంజనీరింగ్ అధికారులు రూపొందించనున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ మొబైల్ రైతు బజార్లను నగరాలు, పట్టణాల్లో తిప్పింది. ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి స్పందన రావడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఉపకరించడంతో ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లాక్డౌన్లో రూ.కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా... ► స్క్రాప్ కింద ఆర్టీసీ బస్సులను తీసేయకుండా నో కాస్ట్.. నో ప్రాఫిట్ విధానంలో కార్గో బస్సులుగా, మొబైల్ రైతు బజార్లుగా ఇంజనీరింగ్ అధికారులు మార్చారు. ► కరోనా వ్యాప్తి రైతు బజార్లలో, మార్కెట్లలో ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి వినియోగదారుల వద్దకే సరుకులు తీసుకెళ్లనున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ ఉదంతంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ► లాక్డౌన్ సమయంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో మొబైల్ బస్సులను తిప్పడంతో ఆదరణ లభించింది. -
‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రైతు బంధు ఎగ్గొడతారని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతు బంధు పెట్టిన తరువాతనే దేశంలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వీ అభినందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజారును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... (చదవండి: ఆహ్లాదం అంచున అగాధం!) ‘ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవి. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఏటికి ఎదిరీదినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో 85 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రభుత్వం 12 వందల కోట్ల రుణమాఫీ చేసింది. 52 లక్షల ఖాతాల్లో రైతు బంధు జమ చేశాం. కరోన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకునే విదంగా రైతు బజార్ నిర్మించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. నియంత్రిత సాగుకు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సమీకృత రైతు బజార్లు నిర్మిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ పెరుగుతోంది. నీలి విప్లవం రాబోతోంది. పౌల్ట్రీ రంగంలో అగ్రగామిగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకోబోతున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబెడతాను’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్) -
ఖాళీ ప్రదేశాలకు రైతుబజార్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాల ల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే హైదరాబాద్ చింతలబస్తీల్లోని మార్కెట్‌ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలో తరలించారు. సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్ బస్టాండును మార్కెట్‌గా మార్చేశారు.చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన రైతుబజార్లను జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్‌లపై ఆంక్షలు.. ఇక లాక్డౌన్ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బు కింగ్‌లకు డిమాండ్ పెరగడంతో ఆయిల్ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విని యోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్ బుకింగ్‌లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్ జరిగాక, రెండో బుకింగ్‌కు కనీసం 14 రోజుల గ్యాప్ ఉండేలా ఆంక్ష లు తెచ్చాయి. ఈ మేరకు హెచ్‌పీ, భారత్‌గ్యాస్, ఇండేన్ గ్యాస్‌లు నిర్ణయం తీసుకున్నా యి. గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్‌కు సైతం సిలిండర్ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతుండటం, వినియోగదారులు రెం డుమూడు సిలిండర్లను బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తా యని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్‌లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. -
రైతులెవరైనా తమ పంటల్ని అమ్ముకోవచ్చు..
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలోని నిబంధనలు పూర్తిగా సడలించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మినీ రైతు బజార్లలో రైతులెవరైనా తాము పండించిన కూరగాయలు, పూలు, పండ్లు, అమ్ముకోవచ్చని చెబుతోంది. ఎటువంటి అనుమతులు, కార్డులు అవసరం లేదంటోంది. అక్కడి ఎస్టేట్ అధికారులను కలిసి ఒక పాయింట్‌ను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతోంది. ఈ మేరకు ఎస్టేట్ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. - కొత్తగా ఎవరైనా రైతులు వస్తే.. అప్పటి వరకు రైతు బజార్లలో పేరును రిజిస్టరు చేసుకుని, కార్డుతో అమ్మకాలు కొనసాగిస్తున్న రైతులకు వీరిని జత చేస్తారు. - వీరద్దరూ వారికి కేటాయించిన పాయింట్లో ఎవరి కూరగాయలు వారు అమ్ముకునే సౌలభ్యాన్ని కలిగిస్తున్నారు. - రాష్ట్రంలో ఇంతకు పూర్వం 102 రైతు బజార్లున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి నిర్ణీత సమయాల్లోనే నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలుకు అనుమతిచ్చింది. - అయితే ఆ సమయాల్లోనే కొనుగోలుదారులు అధిక సంఖ్యలో రావడంతో రైతు బజార్లన్నీ రద్దీతో నిండిపోయాయి. కొనుగోలుదారుల మ«ధ్య దూరం లేకపోవడంతో ఈ వైరస్ మరింత వ్యాపించే అవకాశాలేర్పడ్డాయి. - కొనుగోలుదారుల రద్దీని తగ్గించేందుకు వీటిని వికేంద్రీకరించి పాఠశాలలు, పార్కులు, ఇతర మైదాన ప్రాంతాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తోంది. - ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా మినీ రైతు బజార్లు ఏర్పాటు కావడంతో కొనుగోలుదారుల రద్దీ తగ్గింది. ఈ రద్దీని ఇంకా తగ్గించేందుకు కొత్త రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. - దీనితోపాటు లాక్డౌన్ కారణంగా రైతులు పండించిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు రవాణా అయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గాయి. స్థానికంగా వీటిని అమ్ముకునే సౌలభ్యాన్ని కలిగిస్తే రైతులు కొంత వరకు లబ్ధి పొందుతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు బజార్ల డైరెక్టర్ ఇస్సార్ అహ్మద్ తెలిపారు. -
ఉల్లి మరో 3 వారాలు కొరతే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి కొరత మరో 3 వారాల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అందులో 500 టన్నులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు వారం రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయించేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు చూపించిన వారికి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయించనున్నారు. కొరతను వ్యాపారులు అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ.3,700 నుంచి రూ.6,000కు గరిష్టంగా పెరిగింది. కాగా,ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో మూడు, నాలుగు వారాలు ఆలస్యమైంది. దీంతో ఖరీఫ్ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో 10 వేల ఎకరాల్లోపే ఉల్లి సాగవుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ఆలస్యపు రుతుపవనాల వల్ల విస్తీర్ణం తగ్గింది. కోత సీజన్లో అకాల వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి రవాణాపైనా ప్రభావం పడింది. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది. -
రూ. 25కే కిలో ఉల్లిపాయలు
సాక్షి, ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉల్లిగడ్డల అవసరాలు తీర్చేందుకు జిల్లాకు 5 టన్నులు కేటాయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు బజార్ల ద్వారా వాటిని ప్రజలకు విక్రయించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వమే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే మొదటి విడతగా జిల్లాలోని నాలుగు రైతు బజార్ల ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ కె.వి.ఎన్.ఉపేంద్ర కుమార్ రైతు బజార్ల సిబ్బందిని ఇప్పటికే సన్నద్ధం చేశారు. కర్నూలు జిల్లా నుంచి ఒంగోలు నగరానికి గురువారం అర్ధరాత్రికి లారీల ద్వారా ఉల్లిగడ్డలు చేరుకోనున్నాయి. అందుకోసం ఒంగోలు నగరంలోని మూడు రైతు బజార్లలో శుక్రవారం నుంచి ఉల్లిగడ్డలు విక్రయించే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కందుకూరు రైతు బజారుకు శుక్రవారం నేరుగా కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డలు లారీల ద్వారా చేరుకోనున్నాయి. ఒంగోలులో నగరంలో లాయరు పేట సాయిబాబా గుడి పక్కన, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు దిబ్బల రోడ్డులో, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని రైతు బజార్ల నుంచి ఉల్లిగడ్డలు విక్రయిస్తారు. ఒక్కో కుటుంబానికి ఒక కిలో చొప్పున మొదట అందజేస్తారు. కిలో ఉల్లిగడ్డలు రూ. 25 చొప్పున విక్రయిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ కె.వి.ఎన్.ఉపేంద్ర కుమార్ తెలిపారు. ఉల్లిగడ్డల కోసం వచ్చే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు తీసుకొని రైతు బజార్లకు రావాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉల్లిగడ్డలు తెప్పించేందుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో రోడ్డు రవాణాకు పూర్తిగా ఆటంకం ఏర్పడటంతో తొలుత కర్నూలు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. -
వెజి‘ట్రబుల్స్’ తీరినట్టే..!
సాక్షి, శ్రీకాకుళం: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేం దుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆర్థిక చేయూత, రాయితీల కల్పనతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన కార్యరూపం దాల్చింది. ఇందులో భాగంగా మన జిల్లాకు ఐదు కొత్త రైతు బజార్లు వస్తున్నాయి. ఇప్పటికే కేటాయింపు ఉత్తర్వులు మార్కెటింగ్ శాఖకు వచ్చాయి. స్థల సేకరణ పూర్తి చేసిన వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఒక్కో రైతు బజార్‌కు రూ. 50లక్షల వరకు మంజూరు కానుంది. పండించిన కూరగాయలను రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు వీలుగా జిల్లాలో మరో ఐదు రైతు బజార్లను ఏర్పాటు చేయబోతోంది. తగిన ధరకు అమ్ముకునే అవకాశం రైతులకు దక్కనుండగా, తాజా కూరగాయలు వినియోగదారులకు బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మాళిలో మాత్రమే రైతు బజార్లు ఉన్నాయి. ఇవి కాకుండా టెక్కలిలో మరొకటి నిర్మాణంలో ఉంది. తాజాగా మంజూరైన వాటితో జిల్లాలో రైతు బజార్ల సంఖ్య తొమ్మిదికి చేరనుంది. కొత్తవి ఏర్పాటు చేసేదిక్కడే జిల్లాకు కొత్తగా మంజూరైన రైతు బజార్లను నరసన్నపేట, పలాస, రాజాం, పాలకొండ, కొత్తూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే లిఖితపూర్వక ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వ పరిశీలన నేపథ్యంలో పాలకొండ, కొత్తూరులో స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. మిగతా నరసన్నపేట, రాజాం, పలాసలో స్థలసేకరణ చేయాల్సి ఉంది. వీటి కోసం సంబంధిత తహశీల్దార్లకు స్థలసేకరణ ఉత్తర్వులు పంపించారు. ఒక్కొక్క రైతు బజారులో 40నుంచి 50వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. స్థలసేకరణ పూర్తి చేసి పంపించిన వెంటనే ప్రభుత్వం ఒక్కో దానికి సుమారు రూ. 50లక్షలు మంజూరు చేసేందుకు అవకాశముంది. శ్రీకాకుళంలో.. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ప్రస్తుతానికి ఒకే ఒక రైతు బజారు ఉంది. ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్ రైతు బజారు ఏర్పాటు చేయాలన్న యోచనకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నం, రాజ మహేంద్రవరంలో మాత్రమే మొబైల్ రైతు బజార్లు ఉన్నాయి. ప్రజల చెంతకే రైతు బజారు కూరగాయలు రానున్నాయి. రైతుల నుంచి సేకరించిన కూరగాయలను గ్రేడింగ్ చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలో మంజూరు కానుంది. శ్రీకాకుళం పట్టణ వాసుల డిమాండ్ దృష్ట్యా మొబైల్ రైతు బజారుతో పాటు ఉన్న రైతు బజారును ఆధునీకరించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 15 స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్, ఇతరత్రా సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో రానున్నాయి. రైతులకు మేలు జిల్లాకు కొత్తగా ఐదు రైతు బజార్లు మంజూరయ్యాయి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనలో భాగంగా మన జిల్లా కు ఐదు కేటాయించారు. ఇప్పటికే కొత్తూరు, పాలకొండలో స్థల సేకరణ చేశాం. పలాస, రా జాం, నరసన్నపేటలో సేకరణ చేయాల్సిం ఉంది. తహసీల్దార్లను స్థల సేకరణ కోసం పంపించాం. – బి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
మంగళగిరిలో రాజన్న రైతు బజార్ ప్రారంభించిన ఆర్కే
-
గూడెంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైతు బజార్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తాడేపల్లిగూడెంలో రూ.2.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైతుబజార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తాడేపల్లిగూడెంతో పాటు 45 మండలాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో భారీ కోల్డ్ స్టోరేజీ యూనిట్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో హోల్‌సేల్ రైతు బజార్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆరు నెలల్లో ఈ ఆధునిక రైతు బజారును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన తోటల పెంపకం, పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. ప్రతి రైతు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే 20 శాతం అదనపు ఆదాయం అర్జించుకోగలుగుతాడని అన్నారు. యంత్ర సాయంతో పంట ఉత్పత్తులను కటింగ్ చేస్తే పాడవకుండా తాజాదనంతో ఉంటాయన్నారు. అపరాల సాగు పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సబ్సిడీ సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. పాలసేకరణలో ముందంజ వేయాలి ప్రైవేటు డెయిరీలకు దీటుగా పాలసేకరణ ధరను పెంచామని, ఇటువంటిస్థితిలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాలసేకరణ ముమ్మరం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం లక్ష లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేశామని, మరో లక్ష లీటర్ల సామర్థ్యం గల శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటులో ఉన్నామని తెలిపారు. పశుగ్రాసం కొరత లేకుండా పశువులకు అవసరమైన గడ్డిని పెంచేందుకు 5 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ ఏడీ విజయలక్ష్మి, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
కూరగాయల మార్కెట్ రైతు బజార్‌కు తరలేనా..!
నూతన కలెక్టర్ చొరవ చూపాలి ఏకైక కూరగాయల మార్కెట్ ఆధునీకరించినా సమస్యలే జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా అవతరించింది. పట్టణంలో ఏకైక ప్రధాన కూరగాయల మార్కెట్ ఉంది. మార్కెట్ ఒకటే ఉండటంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మార్కెట్‌ను ఆధునీకరించారు. అయినప్పటికీ స్థలం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని పట్టణంలోని విద్యానగర్‌లో సుమారు రూ.50 లక్షలతో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అది నిరుపయోగంగానే మారింది. ఇటీవల సబ్‌కలెక్టర్ కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించేలా రైతులతో మాట్లాడారు. మార్కెట్ ఆధీనంలో ఉన్న రైతుబజార్‌ను బల్దియాకు అప్పగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ సమర్పించారు. విశాలమైన రైతుబజార్‌ను నిరుపయోగంగా ఉండకుండా మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతిపాదనలకే పరిమితం గతంలో సైతం రైతుబజార్‌కు ప్రధాన కూరగాయల మార్కెట్‌ను తరలిద్దామని అధికారులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ రైతులు ఒప్పుకోకపోవడంతో రైతుబజార్ శిథిలావస్థకు చేరింది. జనసాంద్రత ఉన్న చోట మార్కెట్ అయితే లక్షకు పైగా ఉన్న పట్టణంలో ఒకే కూరగాయల మార్కెట్ కాకుండా జనం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జగిత్యాలలో మంచినీళ్లబావి, అంగడిబజార్‌లో, ధరూర్ క్యాంపులోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ ఒకటే కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో వీలుగా ఉంటుంది. నూతన కలెక్టర్ చొరవ చూపేనా? జగిత్యాల జిల్లాగా అవతరించగా నూతన జిల్లా కలెక్టర్ శరత్ చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్‌కు తరలిస్తే ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. -
మరో 11 రైతు బజార్లు: మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు : రాష్ట్రంలో మరో 11 రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రైతు బజార్లలో ధరల సూచికలతో కూడిన ఎలక్ట్రానిక్ డిస్ప్లేను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్కెట్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మార్కెటింగ్ ఆదాయం నుంచి 20 శాతం నిధులు, 20 శాతం మ్యాచింగు గ్రాంటుతో లింక్ రోడ్లు వేయాలని నిర్ణయించామని చెప్పారు. దీనికి సంబంధించి జూలై 30 కల్లా అన్ని జిల్లాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రైతు ఉపశమన అర్హత పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. రూ.3,512 కోట్లను 32.9 లక్షల రైతుల ఖాతాలకు జమచేయనున్నట్టు చెప్పారు. -
ఉల్లి కోసం ఆగని పోరాటం
చిత్తూరు: ఉల్లి గడ్డల కోసం జనం సాగిస్తున్న పోరాటాలను అడ్డుకోలేక పోలీసులు చేష్టలుడిగి చూస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు నగరంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన రూ.20 కే కిలో ఉల్లి విక్రయకేంద్రం వద్ద పరిస్థితే ఇందుకు నిదర్శనం. బుధవారం ఉదయం 5 గంటలకే రైతు బజార్ కు జనం క్యూకట్టారు. దాదాపు 1700 మంది తరలిరాగా తోపులాట మొదలైంది. కానీ, బందోబస్తు కోసం అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. వారు అంతమంది జనాన్ని అదుపులోకి తేలేక చేతులెత్తేశారు. ఉదయం 8.30 గంటలకు జనం తోపులాటలు, అరుపులు కేకలతో రైతు బజార్ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రూ.20 కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గలేదు. నగరంలోని 8 విక్రయ కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచే క్యూలు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి రూ.70 వరకు పలుకుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారిని నియంత్రించేందుకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రైతు బజార్లో మంత్రి గంటా తనిఖీలు
విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు. ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి అందుబాటులో ఉండేలా చూడాలని గంటా శ్రీనివాసరావు రైతు బజారు అధికారులకు సూచించారు. -
కిలో ఉల్లి కోసం గంటల నిరీక్షణ
మిర్యాలగూడ అర్బన్: ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిగడ్డలు రూ.20 కే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజారులో కౌంటర్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిసిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భారీ క్యూ ఏర్పడింది. కుటుంబానికి కిలో చొప్పున ఇచ్చే ఉల్లిగడ్డల కోసం గంటల తరబడి క్యూలో ఎదురుచూపులు చూశారు. పట్టణంలో ఒకే కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు జనం భారీగా వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్థానికులు ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. -
రైతుబజార్లో 'ఉల్లి' జాతర
అనంతపురం : రైతులు, వినియోగదారుల తాకిడి లేక బోసిపోయి అలంకార ప్రాయంగా ఉన్న అనంతపురం జిల్లా స్థానిక రైతుబజార్ గురువారం పూర్వ వైభవం సంతరించుకున్నట్లుగా జనంతో కిటకిటలాడింది. బైకులు, బ్యాగులతో వందలు, వేల సంఖ్యలో వినియోగదారులు తరలిరావడంతో రైతుబజార్ రద్దీగా కనిపించింది. వందలమంది నెత్తిన బ్యాగు పెట్టుకుని గంటల కొద్దీ లైన్లలో నిలుచున్నారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడలేక ముందు, వెనుకనున్న వారికి చెప్పి వృద్ధులు, మహిళలు చెట్ల కింద కాసేపు సేదతీరడం కనిపించింది. ఇంతకీ ఈ శ్రమంతా దేనికనుకుంటున్నారు? రెండు కిలోల ఉల్లిగడ్డల కోసమే! బహిరంగ మార్కెట్లో ఉల్లి ఘాటెక్కడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా యంత్రాంగం రైతుబజార్లో బుధవారం ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేసింది. కిలో రూ.20 ప్రకారం ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేపట్టింది. దీంతో రెండు కిలోల ఉల్లి కోసం రెండు గంటలపాటు క్యూలో నిల్చుకుని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక కౌంటర్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఒక్క రోజే 2,500 మందికి పైగా వినియోగదారులకు ఉల్లి పంపిణీ చేసినట్లు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్ రుద్ర తెలిపారు. -
కర్నూలు, నంద్యాల్లో సంచార రైతుబజార్లు
కర్నూలు(అగ్రికల్చర్): సంచార రైతు బజార్ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతుబజార్ల ముఖ్య కార్య నిర్వహణాధికారి మురుగేష్ కుమార్ సింగ్(ఎం.కె.సింగ్) జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన సి.క్యాంపు రైతు బజారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ కర్నూలులో 2, నంద్యాల 1 ప్రకారం సంచార రైతు బజార్లు నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్నామని, వీటికి కూరగాయలు సరఫరా చేసే రైతులను గుర్తించాలన్నారు. కర్నూలు, విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడల్లోని రైతు బజార్లలో కొత్తగా ఈ-వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రైతు బజారులో పరిశీలించారు. రైతులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే ఈ-వైద్యం లక్ష్యమన్నారు. రైతులకు వీడియో కాన్ఫరెన్స్ తరహాలో హైదరాబాద్ నుంచి వైద్య సేవలు అందిస్తారన్నారు. ఇక్కడ ఒక కన్సల్టెంట్‌ను నియమిస్తామని, రైతు బజారుకు వచ్చే రైతులు, వినియోగదారులు వివిధ వ్యాధుల నివారణకు కన్సల్టెంట్‌ను సంప్రదిస్తే వారిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యులు పరిశీలించి వైద్యం సూచిస్తారన్నారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు. ప్రధాన పట్టణాల్లో వినియోగదారులకు తాజా కూరగాయలు తక్కువ దరకు అందేలా సంచార రైతు బజార్ల వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
గర్భం దాల్చిన మైనర్ బాలిక
గర్భం దాల్చిన మైనర్ పోలీసులకు ఫిర్యాదు: కేసు నమోదు వికారాబాద్/నవాబుపేట: ఓ బాలికపై బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తరచూ అఘాయిత్యానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన నవాబుపేట మండలం అక్నాపూర్‌లో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయిన కావలి నర్సింలు(29) మెహిదీపట్నంలోని రైతు బజార్లో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. ఏడాదిగా అతడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. దాదాపు ఆరు నెలల క్రితం నర్సింలు బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయాక ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం విషయం తెలుసుకున్న బాలిక అతడిని నిలదీయడంతో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్న నర్సింలు తరచూ బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల క్రితం బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. ఈ విషయమై బాధితురాలి కుటుంబీకులు నర్సింలును ప్రశ్నించగా కొన్నిరోజుల తర్వాత బాలికను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ముందుగా అబార్షన్ చేయిద్దామని చెప్పడంతో బాలికను తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భం తీయించారు. తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని మూడు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు నర్సింలు వద్దకు వెళ్లగా విషయం దాటవేశాడు. దీంతో వారు శనివారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు నిందితుడు నర్సింలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు బజార్లో తెలుగు తమ్ముళ్ల బాగోతం
తుని(తూ.గో): మరోసారి తెలుగు తమ్ముళ్లు తమ బాగోతాన్ని బయటపెట్టారు. మీడియా స్వేచ్ఛను అడ్డకుంటూ సాక్షి ప్రతినిధిపై బెదిరింపు చర్యలకు పాల్పడిన ఘటన జిల్లాలోని తుని రైతు బజార్లో గురువారం చోటు చేసుకుంది. కొంతమంది రైతులకు చెందాల్సిన షాపుల్లో తెలుగు తమ్ముళ్లు పాగా వేసి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా మీడియాపై కూడా చిందులు వేశారు. తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధిపై బెదిరింపులకు దిగారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వారు తమ దైన శైలిలో హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై సాక్షి ప్రతినిధి పోలీసుల్ని ఆశ్రయించాడు.