గర్భం దాల్చిన మైనర్ బాలిక | 14 years old girl was raped | Sakshi
Sakshi News home page

గర్భం దాల్చిన మైనర్ బాలిక

Published Sat, Nov 29 2014 11:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

గర్భం దాల్చిన మైనర్ బాలిక - Sakshi

గర్భం దాల్చిన మైనర్ బాలిక

గర్భం దాల్చిన మైనర్
పోలీసులకు ఫిర్యాదు: కేసు నమోదు
 
వికారాబాద్/నవాబుపేట: ఓ బాలికపై బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తరచూ అఘాయిత్యానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన నవాబుపేట మండలం అక్నాపూర్‌లో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయిన కావలి నర్సింలు(29) మెహిదీపట్నంలోని రైతు బజార్‌లో కూరగాయాలు విక్రయిస్తుంటాడు.

ఏడాదిగా అతడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. దాదాపు ఆరు నెలల క్రితం నర్సింలు బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయాక ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం విషయం తెలుసుకున్న బాలిక అతడిని నిలదీయడంతో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్న నర్సింలు తరచూ బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల క్రితం బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు.

దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. ఈ విషయమై బాధితురాలి కుటుంబీకులు నర్సింలును ప్రశ్నించగా కొన్నిరోజుల తర్వాత బాలికను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ముందుగా అబార్షన్ చేయిద్దామని చెప్పడంతో బాలికను తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భం తీయించారు. తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని మూడు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు నర్సింలు వద్దకు వెళ్లగా విషయం దాటవేశాడు. దీంతో వారు శనివారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు నిందితుడు నర్సింలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement