యాక్సిడెంట్  చెప్పిన రేప్ | Teenage girl's road accident reveals rape, pregnancy Thane, | Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్  చెప్పిన రేప్

Published Thu, Jan 14 2016 2:28 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

యాక్సిడెంట్  చెప్పిన రేప్ - Sakshi

యాక్సిడెంట్  చెప్పిన రేప్

ముంబై: దాచాలన్నా దాగని సత్యం ఒకటి అనూహ్యంగా  బైటపడింది. ముంబైలోని థానే నగరంలో  జరిగిన  రోడ్డు ప్రమాదం ఓ ఆశ్చర్య కరమైన విషయాన్ని వెలుగులోకి  తెచ్చింది. వెగ్లా ఎస్టేట్ కాలనీ నివసించే మైనర్ బాలిక(14) రోడ్డు ప్రమాదానికి గురైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినపుడు ఆమె గర్భవతి అని పరీక్షల్లో తేలింది.   

థానే  పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  ఈనెల 6న వేగంగా వచ్చిన వాహనం బాలికను ఢీకొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ములుంద్ లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు వైద్యులు అబ్దామినల్ స్కానింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులు నివ్వెర పోయారు.

బాలిక  ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు మెహబూబ్ సయాద్ (23)  అనే యువకుడిని బుధవారం అరెస్ట్ చేశారు. బాధిత బాలిక కుటుంబం చెత్త ఏరుకుని జీవనం సాగిస్తూ వుంటుంది. ఫుట్పాత్ పైన వీరి జీవనం. ఈ క్రమంలో స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే యువకుడు బాలికపై  అత్యాచారానికి తెగబడ్డాడని  పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement